తెలంగాణ

గొల్లపల్లి లో యూరియా కోసం అన్నదాతల అవస్థలు

క్రైమ్ మిర్రర్, జగిత్యాల :- గొల్లపల్లి మండలంలో అన్నదాతలు ముప్ప తిప్పలు పడిన సంఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. గొల్లపల్లి మండల కేంద్రంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం పరిధిలోని రైతులు యూరియా కోసం ముప్పు తిప్పలు పడ్డారు. దాదాపు 100 మందికి పైగా ప్రజలు ఆఫీస్ దగ్గర ఎగబడిన ఫోటోలు మరియు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. చాలామంది ప్రజలు యూరియా కోసం గంటల తరబడి వ్యవసాయ సహకార సంఘం కార్యాలయం వద్ద లైన్లో ఆధార్ కార్డులు పెట్టి వేచి ఉన్నారు.

ఎంతసేపటికి యూరియా దొరకకపోవడంతో రైతులు ఆందోళనకు దిగారు. చేతిలో ఉన్న ఆధార్ కార్డులు అన్నిటిని కూడా కిందకు విసిరేసి ఆఫీస్ పై అలాగే అధికారులపై ఎగబడడం జరిగింది. దీంతో అక్కడ ఉన్నటువంటి రద్దీ ని చూస్తుంటే పరిస్థితులు తీవ్రంగా ఉన్నాయి. ఇక ఈ విషయం వెంటనే సోషల్ మీడియా మాధ్యమంలో వైరల్ గా మారింది. ఈ ఘటనను పోలీసులకు తెలుపగా పోలీసులు అక్కడికి చేరుకునే అవకాశం ఉంది.

ఇవి కూడా చదవండి

  1. కాంగ్రెస్ మూర్ఖుల్లారా… గోదావరి ఎలా పారుతుందో కళ్ళు తెరిచి చూడండి : హరీష్ రావు

  2. రూ.45 కోట్లు పెట్టుబడి పెడితే గోల్డ్‌ కార్డ్‌ వీసా – ధనికులకు ట్రంప్‌ బంపర్‌ ఆఫర్‌

  3. క్రైమ్ మిర్రర్ ఎఫెక్ట్….అక్రమ మట్టి తవ్వకాల ప్రాంతం పరిశీలించిన అధికారులు

Back to top button