రాజకీయం

ఓకే వేదికపై ముగ్గురు ముఖ్యమంత్రులు!… ఏ విషయంలో?

దావోస్ లో ఏపీ, తెలంగాణ, మహారాష్ట్రల పెట్టుబడుల ఆకర్షణ వేట కొనసాగుతోంది. మూడు రాష్ట్రాల సీఎంలు తమ రాష్ట్రాలకు వీలైనంత ఎక్కువ పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. మరోవైపు అక్కడ జరిగిన ‘కంట్రీ స్ట్రాటజిక్ డైలాగ్’ సమావేశంలో ముగ్గురు సీఎంలు చంద్రబాబు, రేవంత్ రెడ్డి, ఫడ్నవిస్ లు పాల్గొన్నారు. ముగ్గురూ ఒకే వేదికను పంచుకున్నారు. దేశం ఒక యూనిట్ గా పెట్టుబడులను రాబట్టేలా కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది.

Read More : ఇండ్లకు 24 గంటలు తాగునీటి సరఫరా.. దేశంలో తొలి నగరంగా రికార్డ్

ఈ కార్యక్రమం సందర్భంగా ఏఐ, రక్షణ, గ్రీన్ ఎనర్జీ రంగాల్లో పెట్టుబడులకు సంబంధించిన అంశాలు చర్చకు వచ్చాయి. రాష్ట్రాల ఆకాంక్ష ఏ విధంగా ఉంది? గ్లోబల్ కంపెనీలు భారత్ లో పెట్టుబడులు పెట్టడం అనే అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా ఓ ప్రశ్నకు బదులిస్తూ చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వాళ్లు (తెలంగాణ, మహారాష్ట్ర) వెరీ రిచ్. మేము వెరీ పూర్ అంటూ రేవంత్ రెడ్డి, ఫడ్నవిస్ లను చూస్తూ కామెంట్ చేశారు. ముంబై ‘ఫైనాన్షియల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా’ అని… తెలంగాణ ‘హైయ్యెస్ట్ పర్ క్యాపిటా ఇన్ ఇండియా’ అని చంద్రబాబు అన్నారు. మేము వెరీ పూర్ అని చమత్కరించారు. దీంతో, అక్కడ ఒక్కసారిగా నవ్వులు విరబూశాయి.

Read More : ఏం చేస్తారో తెలియదు!.. వెంటనే యుద్ధం ఆపండి? పుతిన్ ను హెచ్చరించిన ట్రంప్!..

Back to top button