క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : తమిళనాట మరో రాజకీయ పార్టీ ఏర్పాటు కానుందా? అంటే అవుననే సమాధానం వస్తోంది. ఇటీవలే నటుడు విజయ్ కొత్త పార్టీని ప్రకటించారు. తాజాగా, ఆయన బాటలో మరో ప్రముఖ నటుడు, తెలుగువాసి విశాల్ కూడా పయనించనున్నట్టు తెలుస్తోంది. విశాల్ రాజకీయ పార్టీ పెట్టనున్నట్లు సమాచారం. మొదటి నుంచే రాజకీయాలపై విశాల్ ఆసక్తి చూపుతున్నారు. గతంలో ఆయన ఆర్కేనగర్ ఉప ఎన్నికల్లో పోటీకి సిద్దమై నామినేషన్ వేశారు. అయితే, రిటర్నింగ్ అధికారులు ఆ నామినేషన్‌ను తిరస్కరించారు. అలాగే, తన అభిమాన సంఘాన్ని ‘విశాల్ మక్కల్ నల ఇయక్కం’గా ( ప్రజా సంక్షేమ సంఘం)గా మార్చి అన్ని జిల్లాల్లో ఇన్ఛార్జులను నియమించి, బూత్ కమిటీలనను కూడా ఏర్పాటు చేశారు.
Read Also : మరో పాదయాత్రకు సిద్ధమైన బండి సంజయ్.. అక్కడి నుంచే ప్రారంభం!!
ఔట్‌డోర్ షూటింగ్‌లకు వెళ్లినప్పుడు విశాల్ అక్కడి ప్రజల కష్టాలు, అవసరాలను అడిగి తెలుసుకుని సాయం చేస్తూ, సమస్యలను పరిష్కరిస్తుంటారు. ఈ క్రమంలో విశాల్ మక్కల్ నల ఇయక్కం నిర్వాహకులను త్వరలోనే చెన్నైకి పిలిపించి సమాలోచన జరపనున్నట్లు తెలుస్తోంది. వారితో సమాలోచనల అనంతరం ఆయన పార్టీని ప్రకటించే అవకాశం ఉందని సమాచారం. అయితే, విశాల్ కొత్త పార్టీని ప్రకటించినా విజయ్ మాదిరిగానే వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయరని, 2026 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయొచ్చని భోగట్టా. ఇదిలా ఉండగా, కొద్ది రోజుల కిందట ఏపీ రాజకీయాల్లోకి విశాల్ ప్రవేశించి, వైఎస్ఆర్సీపీ తరఫున కుప్పం నుంచి చంద్రబాబుపై పోటీచేస్తారనే ప్రచారం కూడా జరిగింది. కానీ, దీనిని ఆయన ఖండించారు. తనకు అటువంటి ఆలోచన ఏదీ లేదని తేల్చిచెప్పారు.
ఇవి కూడా చదవండి :
- అప్పుడే మెుదలైన బానుడి బ్యాటింగ్… రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు
- తెలంగాణ అసెంబ్లీలో బీజేపీ శాసన సభాపక్ష నేత పదవిపై కొనసాగుతున్న సస్పెన్స్.. రేసులో ఆ నలుగురు..!
- తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. గ్రూప్ 1లో పోస్టుల సంఖ్యను పెంచుతూ ఉత్తర్వులు
- కృష్ణా నదీ జలాల వాటపై కేసీఆర్ మరో పోరాటం.. 13న నల్లగొండలో భారీ బహిరంగ సభ
- మియాపూర్ సీఐ ప్రేమ్‌కుమార్ సస్పెండ్…
One Comment