CRIME NEWSHyderabadRangareddyTelangana

కోబ్రా న్యూస్ సీక్రెట్ ఆపరేషన్ పేరిట రాసిన వార్త కథనం పరిశీలిస్తే… ఇతరుల వ్యక్తిత్వం హననం..

క్రైమ్ మిర్రర్, ప్రత్యేక ప్రతినిధి : కోబ్రా న్యూస్ సీక్రెట్ ఆపరేషన్ పేరిట రాసిన వార్త కథనం పరిశీలిస్తే, ఇతరుల వ్యక్తిత్వ హననానికి పాల్పడడానికి తప్పితే, అందులో విషయమేమీ లేదన్నది స్పష్టమవుతోంది. ఒక జర్నలిస్టును లక్ష్యంగా చేసుకొని, లేనిపోని అబద్దాలను కల్పించి వండి వార్చిన కథనం ఇది అని చదివిన ఎవరికైనా ఇట్టే తెలిసిపోతుంది.

ఒక జర్నలిస్ట్ ఖరీదైన కారు, ఇల్లు, ఫర్నిచర్ కలిగి ఉంటే అతడు బ్లాక్ మెయిలర్ అన్నట్లుగా చిత్రీకరించడం ఎంతవరకు సబబు. అందరూ జర్నలిస్టులో బ్లాక్ మెయిలింగ్ చేసే సంపాదిస్తారనుకోవడం పచ్చ కామెర్లు వచ్చిన వాడికి లోకమంతా పచ్చగానే కనిపించినట్లుగా, ఈ వార్త కథనం రాసిన జర్నలిస్టు మనోస్థితి ఉన్నట్లు తేటతెల్లమవుతుంది. ఏ ఛానల్ లో పనిచేయడం లేదని, ఫ్రీ లాన్స్ జర్నలిస్టుగా ముఖ్యమంత్రి కార్యాలయంలో ఓఎస్డీలతో పరిచయాలు పెట్టుకొని పైరవీలను చేసుకుంటున్నారని ఆరోపించారు. ఏ ఛానల్ లో పనిచేయని జర్నలిస్టుకు ఎవరు మాత్రం ఎందుకు పైరవీలు చేసి పెడతారన్న చిన్న లాజిక్ ఇక్కడ సదరు జర్నలిస్టు మిస్సయ్యాడు. ఓ ఎస్ డి చైర్ లో కూర్చుని, పైరవీలు…దందాలు చేస్తున్నాడని చెప్పడం కూడా అభూతకల్పనే అవుతుంది. ఎందుకంటే ఎంత సాన్నిహిత్యం ఉన్న ఒక అధికారి, జర్నలిస్టుని తన సీట్లో కూర్చోబెట్టడు కదా,?!. ఇక సీఎంఓ కార్యాలయం నుంచి ఫోన్లు చేసి అధికారులను బెదిరిస్తున్నారన్నది… చెబితే ఎవరైనా నమ్మే విధంగా ఉండాలి.

ఎందుకంటే, సీఎం ఓ కార్యాలయం నుంచి ఫోన్లు చేస్తే, ఒక జర్నలిస్టుకు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు ఎందుకు భయపడతారనే ప్రశ్నకు సదరు జర్నలిస్టే సమాధానం చెప్పాలి. ఇకపోతే, దళిత జర్నలిస్ట్ కార్డుని ఉపయోగించుకొని పైరవీలను చేస్తున్నారనేది శుద్ధ అబద్ధం. ఎందుకంటే, పరోక్షంగా ఎవరైతే జర్నలిస్టు పేరును ప్రస్తావిస్తూ అప్రతిష్ట పాలు చేయాలని కోబ్రా న్యూస్ లో ఈ కథనం రాశారో, సదరు ఒక సామాజిక జర్నలిస్టులకు సారథిగా వ్యవహరిస్తూ, అడిగిన.. అడగకపోయినా తన కులం పేరును తరచూ ప్రస్తావించే వ్యక్తి. అటువంటి వ్యక్తి దళిత కార్డును వాడుతూ, పైరవీలకు పాల్పడుతున్నారని రాయడం అంటేనే అంతకంటే దుర్మార్గం మరొకటి ఉండదు. సూడో జర్నలిస్టు అంటూ పెద్ద పెద్ద పదాలను వాడారు. సూడో జర్నలిస్ట్ అంటే అర్థం తెలుసా?, పలు తెలుగు దినపత్రికల్లో , చానళ్ల లో ఉన్నత స్థాయిలో పనిచేసిన వ్యక్తిని సూడో జర్నలిస్ట్ అని సంబోధించాడంటే అతడి అజ్ఞానాన్ని చూసి నవ్వుకోవడం మినహా చేయగలిగిందేమీ లేదు.. సొంత ఇంట్లో వ్యవహారాన్ని వేలెత్తి చూపే ప్రయత్నం చేసిన కోబ్రా న్యూస్ జర్నలిస్ట్, తన ఇంట్లో జరిగిన సంఘటనకు ఇతరులను బాధ్యుల్ని చేస్తూ అప్రతిష్ట పాలు చేయాలనుకోవడం అవివేకం కాకపోతే మరేమవుతుంది. ముందు తన ఇంటిని చక్కబెట్టుకోలేని వాడు, సమాజాన్ని ఉద్ధరించడానికి బయల్దేరాడని మేము విమర్శించవచ్చు… కానీ అది సభ్యత కాదని అలా అనడం లేదు. ఇకపోతే తానేదో పత్తిత్తునన్నట్లుగా ఇతరులపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్న సదరు జర్నలిస్టు గురించి ఎవరికి తెలియదు. దాదాపు పదేళ్ల జర్నలిజం జీవితంలో ఇప్పటికే అన్ని టీవీ ఛానళ్ల ను చుట్టేసిన ఘనత ఆ మహానుభావుడిది.

ఎక్కడ సక్కగా ఏడాది పాటు కూడా పనిచేయని ఆ పెద్దమనిషి, ఇతరుల గురించి మాట్లాడడం అంటే గురువింద గింజ సామెత గుర్తుకు వస్తుంది. ఇకపోతే తనకు తానేదో పెద్ద క్రైమ్ జర్నలిస్టు అని చెప్పుకుంటూ… స్పా సెంటర్ల వద్ద బ్లాక్ మెయిల్ కు పాల్పడింది నిజం కాదా?, స్పా సెంటర్లలో పనిచేసే అమ్మాయిలతో అనైతిక కార్యకలాపాలకు పాల్పడుతూ అడ్డంగా దొరికిపోయింది అబద్ధమా?, ఇప్పుడు నువ్వు ఎవరినైతే సుడో జర్నలిస్టు అని విమర్శిస్తున్నావో, ఆ జర్నలిస్టు కాళ్లు పట్టుకునే కదా… పోలీస్ స్టేషన్ నుంచి బయటకు వచ్చింది. ఐపీఎల్ మ్యాచ్ల కోసం పోలీసు కమిషనరేట్ కార్యాలయ సిబ్బందిని బ్లాక్ మెయిల్ చేసి టికెట్లు సంపాదించి, అడ్డదారిలో అమ్ముకుంది నిజం కాదా?… ఇలా చెప్పుకుంటూ పోతే రాస్తే రామాయణం, వింటే మహాభారతం అన్నట్లుగా నీ అక్రమాల జాబితా చేంతాడంత పొడవు ఉన్నది. అయినా నీ గురించి ఎక్కువగా రాసి, నువ్వేదో పెద్ద తోపు అని అనుకునే అవకాశం నీకు ఇవ్వవద్దనే, ఇతరులపై బురద చల్లాలనుకుంటే, ఆ బురద మన మీద కూడా పడుతుందని గ్రహిస్తే మంచిది. నువ్వు పేరుకు చివర డి అనే పేరు పెట్టుకొని దానికి కళంకం తెచ్చేవి చేయకు ఇన్…..డీ … ఇట్లు నీ శ్రేయోభిలాషి

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

We have detected ad blocker on your browser, please add it to execution or add to white list, to support us.