
క్రైమ్ మిర్రర్, ఆన్లైన్ డెస్క్ :- తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎండలు భగభగమంటున్నాయి. మొన్నటివరకు కొద్దిగా వర్షాలు పడడం వల్ల ఉపశమనం లభించినా కూడా మళ్లీ ఎండలు దంచి కొడుతున్నాయి. వేడి గాలులతో ప్రజలు ఉక్కిరి బిక్కిరి అవ్వడమే కాకుండా… ఉక్కపోతతో విలవిలలాడిపోతున్నారు. రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగిపోయి పరిస్థితిలు ఉన్నాయని వాతావరణ శాఖ నిపుణులు కొన్ని జాగ్రత్తలు సూచించారు. నేటి నుంచి మరో మూడు రోజులు పాటు మరింత ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉన్నందున ప్రజలందరూ కూడా ఇళ్లలోనే ఉండాలని సూచించారు. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాలలోని కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలకు చేరుకుంటాయని అధికారులు వెల్లడించారు. కాబట్టి ఈ జిల్లాలోని ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని సూచించారు.
ఇక మిగతా జిల్లాల్లో 42 నుంచి 44 డిగ్రీలు నమోదు ఎటువంటి అవకాశాలు ఉన్నాయని వాతావరణ నిపుణులు పేర్కొన్నారు. కాబట్టి ఏమైనా ముఖ్య పనులు ఉంటే ఉదయాన్నే లేదా సాయంత్రం పూట చూసుకోవాలని… మధ్యాహ్నం అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు. తరచూ నీరు తాగుతూ ఉండాలని ప్రజలకు విన్నపించారు. ఇదిలా ఉండగా… ఇవాళ లేదా రేపు దక్షిణ తెలంగాణలో అక్కడక్కడ కొంచెం వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం చెప్పుకొచ్చింది. ఖమ్మం, నల్గొండ, భద్రాద్రి కొత్తగూడెం, గద్వాల్, జోగులాంబ, నారాయణపేట్, నాగర్ కర్నూల్, సూర్యాపేట వంటి జిల్లాలలో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. మరోవైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఇలానే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్తో పోల్చుకుంటే తెలంగాణలో కొంచెం ఎక్కువగానే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.
పోప్ ఫ్రాన్సిస్ చివరి కోరిక ఏంటో మీకు తెలుసా?..
బండి రమేష్ సహకారంతో అల్లాపూర్ అభివృద్ధి- మొయినుద్దీన్, మస్తాన్ రెడ్డి