క్రైమ్

టీవీ సీరియల్ కోసం కొడుకుతో కలసి విషం తాగిన వివాహిత..

TV serial, crime : ఈ మధ్యకాలంలో కొందరు చిన్న చిన్న వాటికే విచక్షణ కోల్పోతూ ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్నారు. ఈ క్రమంలో ఆత్మహత్యలకు పాల్పడటం, ఇతరులపై దాడులు చేసి హతమార్చడం వంటివి చేస్తూ కటకటాల పాలవుతున్నారు. అయితే ఓ వ్యక్తి తన భార్యని కేవలం సీరియల్స్ ముఖ్యమా, లేక నేను ముఖ్యమా..? అని అడిగినందుకు వివాహిత ఏకంగా తన కొడుకుతో పాటు ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన తెలంగాణ రాష్ట్రంలో వెలుగు చూసింది.

పూర్తి వివరాల్లోకి వెళితే స్థానిక రాష్ట్రంలోని మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం కోడిపుంజుల తండాలో రాము (పేరు మార్చాం) అనే వ్యక్తి తన కుటుంబంతో కలిసి నివాసం ఉంటున్నాడు. అయితే రాము కుటుంబ పోషణ నిమిత్తమై స్థానిక గ్రామంలో దొరికే వ్యవసాయ పనులు చేస్తూ ఉండేవాడు. కానీ రాము భార్య మాత్రం ఇంటిపట్టునే ఉంటూ పిల్లలు బాగోగులు, కుటుంబ బాధ్యతలు చూసుకుంటూ ఉండేది. అయితే ఈరోజు రాము పని నిమిత్తమై బయటికి వెళ్లి వచ్చి భార్యని భోజనం పెట్టమని అడిగాడు. అయితే అదే సమయంలో రాము భార్య ఓ టెలివిజన్ ఛానల్లో ప్రసారమవుతున్న సీరియల్ ని చూస్తూ అందులో నిమగ్నమైంది. దీంతో సీరియల్ మధ్యలో అడ్వర్టైజ్మెంట్ వచ్చిన తర్వాత భోజనం పెడతానని రాముకి చెప్పింది. అయితే రాము అప్పటికే ఆకలిగా ఉండటంతో నేను ముఖ్యమా, సీరియల్ ముఖ్యమా…? అంటూ భార్యని కొంతమేర మందలించాడు.

దీంతో మనస్థాపానికి గురైన రాము భార్య ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి తన కొడుకుతో కలిసి గడ్డి మందు తాగి ఆత్మహత్యానికి ప్రయత్నించింది. అదే సమయానికి రాము ఇంటికి రావడంతో వెంటనే భార్యా మరియు కొడుకుని దగ్గర్లో ఉన్న ఆసుపత్రికి తరలించగా రాము భార్య ప్రాణాపాయం నుంచి బయటపడింది. కానీ రాము కొడుకు మాత్రం విషమ పరిస్థితిలో కొట్టుమిట్టాడుతున్నాడు. దీంతో రాము తన కొడుకుని బ్రతికించుకునేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నాడు. అయితే ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో నె టిజన్లు స్పందిస్తూ రాము భార్య చేసిన పని సరైనది కాదంటూ కామెంట్లు చేస్తున్నారు. అంతేకాకుండా చిన్న విషయానికి ఆత్మహత్యాయత్నం చేసి అనవసరంగా తన కొడుకు జీవితాన్ని బలిపెట్టిందంటూ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Read Also News :

  1. బెట్టింగ్ యాప్స్ ఓకే!.. లోన్ యాప్స్ ని కూడా బ్యాన్ చేయండి : యువత

  2. KPHB లో ఆంటీ దగ్గరకి వెళ్ళి హాస్పిటల్ లో చేరిన యువకుడు.. అసలేం జరిగిందంటే…?

  3. ప్రియుడికోసం కట్టుకున్న భర్తనే కడ తేర్చిన భార్య… చివరికి ఏమైందంటే…?

  4. ఉప్పల్‌లో ఉద్రిక్తత: రామంతాపూర్ విద్యుత్ ప్రమాదం ఘటనపై స్థానికుల ఆందోళన

Back to top button