
బాలానగర్, క్రైమ్ మిర్రర్:-
బాలానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో తీవ్ర విషాదం నెలకొంది. కన్నతల్లి తన ఇద్దరు కవల పిల్లలను హత్య చేసి ఆపై తల్లి సాయి లక్ష్మి కూడా భవనం మీద నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది. స్థానికులు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బాలానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో పద్మ నగర్ ఫేస్ వన్ లో సాయి లక్ష్మి, అనిల్ కుమార్ దంపతులు నివాసం ఉంటున్నారు. సాయి లక్ష్మి (27) మంగళవారం తెల్లవారు జామున 4 గంటల ప్రాంతంలో తన కవల పిల్లలను చేతన్ కార్తికేయ (2), లాస్య వల్లి (2) లను గొంతు నులిమి చంపింది. అనంతరం సాయి లక్ష్మి తన నివాసం ఉంటున్న ఇంటి మూడవ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. గత కొంతకాలంగా భర్త అనిల్ తో గొడవ కారణంగా తీవ్ర మనస్థాపానికి గురైన సాయి లక్ష్మి తన పిల్లలను చంపి తాను ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం. సంఘటన స్థలానికి చేరుకున్న బాలానగర్ పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.
Read also : టారిఫ్స్ విధించకపోతే యుద్ధాలు ఆగేవి కాదు.. యుద్ధాలను ఆపగలిగే శక్తి నాకే ఉంది : ట్రంప్
Read also : తడిసిన ప్రతి వరి ధాన్యపు గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది : ఎమ్మెల్యే కుంభం