
చిట్యాల, క్రైమ్ మిర్రర్:- చిట్యాల మున్సిపాలిటీలో ఎనిమిదో వార్డు చంద్రపూరి కాలనీలో మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య పర్యటించారు. బాకీ కార్డులను చిరుమర్తి లింగయ్య పంపిణీ చేశారు. బిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు చేసిన అభివృద్ధి పనులు కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలు బాకీ కార్డులను ప్రజలకు అందించారు. చిరుమర్తి లింగయ్య మాట్లాడుతూ అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ బాకీ కార్డులను పంపిణీ చేశామన్నారు. చిట్యాల మున్సిపాలిటీలో బీఆర్ఎస్ హయాంలో కోట్ల రూపాయలు నిధులు తీసుకొచ్చాం అని దాదాపు 30 కోట్లతో పట్టణంలో అనేక సీసీ రోడ్లు డ్రైనేజీలు వైకుంఠధామాలు,కుల సంఘ భవనాలు అనేక అభివృద్ధి పనులు బీఆర్ఎస్ ప్రభుత్వం లో పూర్తి చేసాం అని అన్నారు. ప్రజలు మున్సిపాలిటీ ఎన్నికల్లో ఓటు వేసి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో శేపూరి రవీందర్, కూరెల లింగస్వామి, జడల ఆది మల్లయ్య, జిట్టా బొందయ్య, జమాండ్ల శ్రీనివాస్ రెడ్డి, మెండే సైదులు, ఆగు అశోక్,ఆవుల ఆనంద్, జిట్టా శేఖర్ ,దగ్గుల సైదులు, పాల నవీన్, కంభంపాటి నరసింహ, దయ్యాల శివ, రమేష్ తదితరులు పాల్గొన్నారు.

Read also : అసలే శీతాకాలం.. పైగా దగ్గు వస్తుందా?.. అయితే పడుకునే ముందు ఇలా చేయండి!
Read also : ఈ మొక్క ఇంట్లో ఉంటే సిరిసంపదలు మీవెంటే!.. మనీ ప్లాంట్ కన్నా చాలా పవర్‌ఫుల్ తెలుసా?





