Lambasinghi Snow Fall: ఏపీలో చలి తీవ్రత భారీగా పెరిగింది. పలు ప్రాంతాల్లో మంచు దుప్పటి పరుచుఉంటుంది. రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే రెండు నుంచి మూడు డిగ్రీలు తక్కువగా నమోదయ్యాయి. అల్లూరి సీతారామరాజు జిల్లా ఏజెన్సీలోని కిలగాడలో అత్యంత తక్కువగా 7.7 ఉష్ణోగ్రత నమోదలయ్యింది. అటు డుంబ్రిగుడలో 8.2, మైదాన ప్రాంతంలోని కళింగపట్నంలో 15.7 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
అంబసింగిలో ప్రకృతి కనువిందు
మన్యంలోని సందర్శనీయ ప్రదేశాలకు పర్యాటకులు అధిక సంఖ్యలో తరలి వచ్చారు. ఏజెన్సీలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్‌లో నమోదు అవుతుండడంతో పొగమంచు దట్టంగా కురుస్తోంది. దీంతో సహజసిద్ధ ప్రకృతి అందాలు మరింత శోభాయమానంగా కనిపిస్తున్నాయి.
మన్యం అందాలు చూసేందుకు పోటెత్తిన పర్యాటకులు
ముఖ్యంగా పాడేరు మండలంలోని వంజంగి మేఘాల కొండ, అరకులోయ మండలంలోని మాడగడ వ్యూపాయింట్, చింతపల్లి మండలం లంబసింగి సమీపంలోని చెరువులవేనం మేఘాల కొండ పరిసరాల్లో దట్టంగా పరుచుకున్న మంచు మేఘాలను చూసి సందర్శకులు పరవశించిపోయారు. పిల్లలు, పెద్దలూ అంతా హ్యాపీగా జాలీగా ఎంజాయ్ చేశారు. అరకు లోయను చూసేందుకు పెద్దసంఖ్యలో టూరిస్టులు తరలి వస్తున్నారు.





