తెలంగాణ

గులాబీ గూటికి తీన్మార్‌ మల్లన్న - ఆ వీడియోల వెనుక అర్థం అదేనా..?

రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే. ఈ గూటి పక్షి… ఏ గూటిలో అయినా వాలొచ్చు. ఇవాళ తిట్టొచ్చు… రేపు కండువా కప్పుకోవచ్చు. అందుకే అంటారు… పాలిటిక్స్‌లో శాశ్వత మిత్రలు, శాశ్వత శత్రువులు అంటూ ఎవరూ ఉండరని. తీన్మార్‌ మల్లన్న కూడా ఇదే ఫార్ములాను ఫాలో అవుతున్నారా..? అదేమో గానీ… హస్తం పార్టీకి దూరమైన ఆయన… కారు ఎక్కబోతున్నారనే వార్త మాత్రం షికారు చేస్తోంది. ఆయన టీమ్‌ పెట్టిన వీడియోలు.. ఆ వార్త నిజమే అనుకునేలా చేస్తున్నాయి. ఇంతకీ ఆ వీడియోలు ఏంటి..? అందులో ఏముంది..?

కులగణనను తీవ్రంగా వ్యతిరేకించిన తీన్మార్‌ మల్లన్న… పెద్ద రచ్చ చేశారు. కులగణన పత్రాలను కాల్చేయాలంటూ ఘాటుగా విమర్శించారు. కాంగ్రెస్‌ నేతలు, రెడ్డి సామాజికవర్గ నాయకులను బండబూతులు తిట్టారు. టీకాంగ్రెస్‌ ఇన్‌ఛార్జ్‌గా మీనాక్షి నటరాజన్‌ రాగానే.. ఆయనపై వేటు పడింది. పార్టీ నుంచి తీన్మార్‌ మల్లన్నను సస్పెండ్‌ చేశారు. దీంతో.. ఆయన దారెటు..? అన్న దానిపై బాగానే చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో.. తీర్మాన్‌ మల్లన్న టీమ్‌ పెట్టిన వీడియోలు పొలిటికల్‌ సర్కిల్‌లో హాట్‌ టాపిక్‌గా మారాయి. ఈ వీడియోలు చూసిన వారు ఎవరైనా సరే.. తీన్మార్‌ మల్లన్న గులాబీ గూటిలో వాలిపోతున్నారని అనుకోక తప్పదు.

తీన్మార్‌ మల్లన్న టీమ్‌.. ఇటీవల కొన్ని వీడియోలు పోస్ట్‌ చేసింది. ఆ వీడియోల్లో… బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌, మాజీ మంత్రి హరీష్‌రావు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను తెగ పొగిడేశారు. కాంగ్రెస్‌లో ఉన్నంత వరకు బీఆర్‌ఎస్‌, కల్వకుంట్ల కుటుంబాన్ని బండ బూతులు తిట్టిన తీన్మార్‌ మల్లన్న… సడెన్‌గా ప్లేట్‌ ఎందుకు ఫిరాయించినట్టు. బీఆర్‌ఎస్‌ అగ్రనేతలను పొగుడుతూ వీడియోలు ఎందుకు పెడుతున్నట్టు. దీన్ని బట్టి.. ఆయన కారెక్కేందుకు సిద్ధమవుతున్నారన్న ప్రచారం జోరుగా జరుగుతోంది. అందులో ఎంత నిజముందో తెలీదు గానీ… తీన్మార్‌ మల్లన్న పెట్టిన వీడియోలను మాత్రం గులాబీ పార్టీ క్యాష్‌ చేసుకుంటోంది. తమకు అనుకూలంగా ఉన్న ఆ వీడియోలను వాడేసుకుంటోంది. కొందరికి మాత్రం.. తీన్మార్‌ మల్లన్న తీరు మింగుడు పడటం లేదు. మొన్నటి వరకు కాంగ్రెస్‌లో ఉండి కల్వకుంట్ల కుంటుంబాన్ని తిట్టి.. ఇప్పుడు బయటకురాగానే… వారిని పొగడం ఏంటి..? అని ప్రశ్నిస్తున్నారు.

ఇవి కూడా చదవండి …

  1. ఏపీ భవిష్యత్‌ జనసేన – ఈ కాన్సెప్ట్‌ వెనకున్న స్ట్రాటజీ ఏంటి…?

  2. తెలంగాణ రాజకీయాల్లో వీహెచ్‌ మార్క్‌ – మున్నూరు కాపులంతా ఏకమయ్యారా?

  3. తెలంగాణ రాజకీయాల్లో వీహెచ్‌ మార్క్‌ – మున్నూరు కాపులంతా ఏకమయ్యారా?

  4. సొంత పార్టీ ఏర్పాటా?… పక్క పార్టీలో చేరడమా ?? తీన్మార్ మల్లన్న ముందున్న దారి ఏమిటి???

  5. పోసాని తర్వాత టార్గెట్‌ ఆయననే..? సజ్జల, ఆయన కుమారుడు భార్గవ్‌ అరెస్ట్‌ తప్పదా..?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button