అంతర్జాతీయం

భారత్ తో వాణిజ్య ఒప్పందం.. ట్రంప్ కీలక వ్యాఖ్యలు!

Trump On Trade Deal:  భారత్ తో వాణిజ్య ఒప్పందానికి అత్యంత దగ్గరలో ఉన్నామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. ఇప్పటికే యూకే, చైనాతో వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు వెల్లడించారు. ఇండియాతో కూడా ట్రేడ్ డీల్‌ త్వరలో చేసుకునే అవకాశం ఉందన్నారు. ఇతర దేశాలతో ఒప్పందాలు చేసుకోవాలనుకోవడం లేదన్నారు. ఈ నేపథ్యంలో లేఖలు పంపిస్తున్నట్లు వెల్లడించారు. ఆసియాలో తమకు అత్యంత కీలక భాగస్వాములైన జపాన్‌, దక్షిణ కొరియాలపై ప్రతీకార సుంకాలను 25 శాతం విధిస్తూ లేఖలు విడుదల చేసిన వేళ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అటు బంగ్లాదేశ్‌, థాయ్‌ లాండ్‌ దేశాలకు కూడా ప్రతీకార సుంకాలు ఆగస్టు 1 నుంచి అమలు అవుతాయని వెల్లడించారు. ఈ మేరకు జపాన్‌, దక్షిణ కొరియాకు ట్రంప్‌ లేఖలు రాశారు.

ఏప్రిల్ 2 నుంచి ట్రంప్ ప్రతీకార సుంకాలు

ఆయా దేశాలు ఏ కారణాలతో పన్నులు పెంచినా, తాము ఇప్పుడు విధించిన 25 శాతానికి అదనంగా ఆ సుంకాలు వేస్తామని ట్రం హెచ్చరించారు. ప్రతీకార సుంకాలను పెంచవద్దని, అలా చేస్తే ఆటో మోబైల్, ఎలక్ట్రానిక్స్ పరిశ్రమలు దెబ్బతించాయని చెప్పారు. నిజానికి 25 శాతం టారిఫ్ చాలా తక్కువేనని చెప్పుకొచ్చారు. ఈ ఏడాది ఏప్రిల్ 2న ప్రపంచ దేశాలపై ప్రతీకార సుంకాలు ప్రకటించారు. ఈ నేపథ్యంలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నది. అంతేకాదు, ఆయా దేశాల మధ్య వాణిజ్య యుద్ధాలకు దారితీసింది. ప్రపంచ స్టాక్‌ మార్కెట్లలో సంక్షోభం తలెత్తింది. ఈ నేపథ్యంలో ప్రతీకార పన్నులను మూడు నెలల పాటు వాయిదా వేశారు ట్రంప్. ఈలోగా ఆయా దేశాలు వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకోవాలని సూచించారు. ట్రంప్ విధించిన టైమ్ జూలై 8తో ముగియనుంది. ఈ నేపథ్యంలో మళ్లీ సుంకాల లొల్లి మొదలయ్యింది.

Read Also: బ్రిక్స్ దేశాలపై ట్రంప్ పిడుగు, ఇదేం టార్చర్ పెద్దన్నా!

Back to top button