క్రీడలు

చెక్కు చెదరని లారా రికార్డ్‌

  • అడుగుదూరంలో నిలిచిపోయిన ముల్డర్‌
  • వ్యక్తిగత స్కోరు 367 పరుగుల వద్ద ఇన్నింగ్స్‌ డిక్లేర్‌
  • రికార్డులకన్నా జట్టు ప్రయోజనాలే మిన్న

క్రైమ్‌ మిర్రర్‌, స్పోర్ట్స్‌ డెస్క్‌: వెస్టిండీస్‌ వెటరన్‌ స్టార్‌ బ్యాటర్‌ బ్రియాన్‌ లారా టెస్టుల్లో నెలకొల్పిన 400 పరుగుల వ్యక్తిగత స్కోరు రికార్డు పదిలంగా ఉండిపోయింది. జింబాబ్వే-సౌతాఫ్రికా మధ్య జరుగుతున్న టెస్టులో లారా రికార్డును ప్రొటీస్‌ తాత్కాలిక కెప్టెన్‌ వియాన్‌ ముల్డర్‌ బ్రేక్‌ చేసేలా కన్పించాడు. అయితే అడుగుదూరంలో నిలిచిపోయాడు ముల్డర్‌. 367 పరుగుల వ్యక్తిగత స్కోరు మీద ముల్డర్‌ ఇన్నింగ్స్‌ను డిక్లేర్‌ చేశాడు. దీంతో లారా రికార్డ్‌కు ఎలాండి ఢోకా లేకుండా పోయింది.

బులవాయో వేదికగా క్వీన్స్ స్పోర్ట్స్ క్లబ్‌లో జింబాబ్వే-దక్షిణాఫ్రికా మధ్య జరుగుతున్న టెస్టులో రెండో రోజు ముల్డర్‌ 367 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద లంచ్‌ ప్రొటీస్‌ జట్టు లంచ్‌కు వెళ్లింది. లంచ్ తర్వాత రెండో సెషన్‌లో సఫారీ కెప్టెన్ ముల్డర్‌… లారా రికార్డ్‌ను బ్రేక్ చేస్తాడని క్రికెట్ అభిమానులు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూశారు. అయితే రెండో సెషన్‌కు కరెక్టుగా నిమిషాల ముందు ప్రొటీస్‌ జట్టు కెప్టెన్‌ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. తొలి ఇన్నింగ్సులో ఐదు వికెట్లకు 626 పరుగుల వద్ద ఇన్నింగ్స్ డిక్లేర్ చేశాడు.

ఈ క్రమంలో లారా రికార్డ్‌ బ్రేక్‌ చేసే అవకాశాన్ని తృటిలో తప్పిపోయింది. వ్యక్తిగత రికార్డులకన్నా… జట్టు ప్రయోజనాలే ముఖ్యమని ముల్డర్‌ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయంతో ప్రపంచ క్రికెట్‌ అభిమానుల మనస్సును ముల్డర్‌ గెలుచుకున్నారు. మరో 10-15 బంతులు ఆడితే లారా రికార్డ్‌కు ముల్డర్‌ ఎసరు పెట్టేవాడు.

Also Read: ఇంగ్లాండ్ గడ్డపై… తొలి డబుల్ సెంచరీ చేసిన ఇండియన్ యువ కెప్టెన్

అయితే… విదేశాల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన బ్యాటర్‌గా ముల్డర్‌ రికార్డ్‌ సృష్టించాడు. టెస్టుల్లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ సాధించిన ఆటగాళ్లలో ఐదో స్థానంలో ముల్డర్ నిలిచాడు. లారా 400 పరుగులతో టాప్‌లో ఉన్నాడు. 2003 లో ఇంగ్లాండ్‌పై లారా 400 పరుగుల మార్క్ అందుకోవడం విశేషం. ఆస్ట్రేలియా మాజీ ఓపెనర్ హెడెన్ 380 పరుగులతో రెండో స్థానంలో ఉన్నాడు. 375 పరుగులతో లారా, 374 పరుగులతో జయవర్ధనే వరుసగా మూడు, నాలుగు స్థానాల్లో ఉన్నారు.

Back to top button