
క్రైమ్ మిర్రర్, తెలంగాణ :- తెలంగాణ రాష్ట్రంలో వాహనాలు నడిపేటువంటి వాహనదారులకు పోలీసులు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. వాహనాలు నడుపుతున్న సమయంలో ఫోన్ ముందు పెట్టుకొని వీడియోలు చూడడం, హెడ్ ఫోన్ లో పాటలు వింటూ ఉండడం వల్ల చాలా ప్రమాదమని హైదరాబాద్ పోలీసులు వాహనదారులకు వార్నింగ్ ఇచ్చారు. ఇకపై అలా చేస్తే ఎవరైనా సరే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వాహనం నడుపుతున్నప్పుడు కేవలం డ్రైవింగ్ మీదే దృష్టి పెట్టాలని… ఇతర వాటిపై దృష్టి పెట్టడం వల్ల మీకు ప్రమాదంతో పాటు మీ వల్ల ఇతరులకు కూడా నష్టం జరిగేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని పోలీసులు సూచించారు. ఆటో, క్యాబ్, బైక్ మరియు టాక్సీ డ్రైవర్లకు ఈ రూల్ వర్తిస్తుంది అని చెప్పుకొచ్చారు. డ్రైవింగ్ చేస్తున్న సమయంలో పూర్తిగా ఏకాగ్రత అనేది డ్రైవింగ్ పైని పైనే ఉంచాలని పలు సూచనలు చేశారు.
Read also : ఆర్‌టీసీ చార్జీల పెంపుపై బిఆర్‌ఎస్ నేతల బస్సు నిరసన యాత్ర
కాగా రాష్ట్రవ్యాప్తంగా ప్రతి ఒక్క వాహనదారుడు కూడా ఈ మధ్య చాలా స్టైల్ గా వాహనాలను నడపడంతోపాటుగా డ్రైవ్ చేస్తున్న సమయంలో బైక్ పై ఇయర్ ఫోన్స్ పెట్టుకొని పాటలు వినడం, అదే కారులో అయితే మ్యూజిక్ పెట్టి సినిమాలు చూడడం లాంటివి ఈమధ్య చాలా ఎక్కువ అయిపోయాయి. అలాగే మద్యం సేవించి వాహనాలను నడుపుతున్న కారణంగా చాలామంది రోడ్డు ప్రమాదాలకు గురవుతున్న సంఘటనలు ప్రతిరోజు చూస్తూనే ఉన్నాం. కాబట్టి ఎవరైతే వాహనాలు నడుపుతారో వారు వారి భద్రత గురించి అలాగే ఇతరుల భద్రత గురించి ఆలోచించాలి అని కోరారు. ఇప్పటినుంచి మ్యూజిక్ పెట్టుకొని వాహనం నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. అలాగే మద్యం సేవించి వాహనాలు నడిపితే మాత్రం ఇకపై మరిన్ని చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. కాబట్టి వాహనదారులు అందరూ కూడా ఈ సూచనలు పాటించాలని… ఒకవేళ వీటిని అతిక్రమిస్తే మాత్రం కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.
Read also : కేంద్ర నిఘా వర్గాల దృష్టిలో తెలంగాణ కీలక నేతలు!