
క్రైమ్ మిర్రర్, పులివెందుల:- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పులివెందుల ఉప ఎన్నికల గురించి మరోసారి తీవ్ర ఆరోపణలు చేశారు. తాజాగా జరిగిన పులివెందుల ఉప ఎన్నికల విధుల కోసం పోలీసులను ఏరుకోరి మరి నియమించారని వైయస్ జగన్మోహన్ రెడ్డి కూటమి ప్రభుత్వం పై తీవ్రంగా మండిపడ్డారు. మరి ముఖ్యంగా తెల్లవారు జామునే డి ఐ జి కోయ ప్రవీణ్ అనే వ్యక్తి పులివెందులకు వచ్చారని.. ఆయన సమక్షంలోనే చాలా దౌర్జన్యాలు జరిగాయని జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఈ డీఐజీ కోయ ప్రవీణ్ అనే వ్యక్తి తెలుగుదేశం పార్టీ మాజీ ఎంపీ గరికపాటి రామ్మోహన్ రావుకు సమీప బంధువు కూడా అవుతాడని చెప్పుకొచ్చారు. వరుసకు అల్లుడు అవుతాడు అని అన్నారు. ఇక డిఐజి తో పాటు వచ్చినటువంటి ఎస్పీ, డీఎస్పీ మరియు సిఐలు అందరూ కూడా వాళ్ల మనుషులే అని వైయస్ జగన్ ఆరోపించారు. ఎంత పెద్ద స్థాయిలో ఉన్న అధికారులు కూడా చంద్రబాబు మాట వినకపోతే జైలు పాలే అని జగన్ కూటమి ప్రభుత్వంపై తీవ్రంగా ధ్వజమెత్తారు.
Read also : అడిగినంత ఇవ్వకుంటే!.. ఉద్యోగం నుంచి తొలగిస్తా? తనిఖీల పేరుతో కక్షసాధింపు చర్యలు</stronga
ఎంతమంది ఎస్పీలను విచారణ పేరిటతో చంద్రబాబు నాయుడు వేధిస్తున్నారని జగన్ ఆరోపించారు. చంద్రబాబు మాట వినకపోతే ఎంతటి స్థాయిలో ఉన్న వారైనా జైలు పాలు అవ్వక తప్పదు అని అన్నారు. ఒక లిస్టు తీసుకుని అందులో ఉన్నటువంటి పేర్లను చదువుతూ వీరందరూ కూడా.. జైలు పాలు అయ్యారని అన్నారు. 8 మంది డిఎస్పీల ను సస్పెండ్ చేశారు. 80 మంది ఇన్స్పెక్టర్లు, వందల మంది కానిస్టేబుళ్లు వి ఆర్ లో ఉన్నారు అని అన్నారు. కాగా ఎన్నుడు లేని విధంగా ఈసారి పులివెందుల జడ్పిటిసి ఎన్నికలలో గందరగోళం జరిగింది. కానీ ఎట్టకేలకు చివరికి ప్రశాంతంగా ముగిసాయి. ఎన్నికల సమయంలో చాలామంది నేతలను హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది.
Read also : ఒంగోలు పోలీస్ స్టేషన్‌లో ఆర్జీవీకి పది గంటల విచారణ