
– జగన్ అడ్డాలో పసుపు జెండా..
– పులివెందుల, ఒంటిమిట్టలో డిపాజిట్లు గల్లంతు
– 30 సంవత్సరాల తర్వాత రికార్డ్ సృష్టించిన టీడీపీ
– జడ్పీటీసీ ఎన్నికల్లో టీడీపీ దే హావా
– జెండా పండుగ రోజున టీడీపీ లో మరో సంబరాలు
క్రైమ్ మిర్రర్, కడప:- ఈ ఏడాది జరిగిన ఎన్నికలలో కూటమి ప్రభుత్వం ఘన విజయం సాధించిన విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. గెలిచిన తర్వాత కూటమి ప్రభుత్వ కార్యకర్తలకు, నాయకులకు సంతోషం అంతా ఇంతా కాదు.. ఏకంగా రాష్ట్రమంతుట కూడా చాలానే ఉత్సవాలు చేసుకున్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తూ.. ఎంతో ఉత్సాహంగా ఉన్న టీడీపీ కి నేడు జగన్ అడ్డా అయినటువంటి పులివెందుల కూడా టీడీపీ అడ్డాగా మారిపోవడంతో టీడీపీ నాయకులకు మరియు కార్యకర్తల ఆనందాలకు హద్దులు లేకుండా పోయాయి. నేడు ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవం నాడు నా… టీడీపీ కి ఇది ఒక పెద్ద గిఫ్ట్.. లైఫ్ లాంగ్ ఈ విజయం గుర్తుండిపోయేలా ఉంటుంది. ఇప్పటికే చాలామంది నాయకులు స్వాతంత్రం రోజున పులివెందులలో స్వేచ్ఛని ఇచ్చామని ప్రెస్ మీట్ ల ద్వారా చెప్పుకొస్తున్నారు.
Read also : జాతీయ పతాకాన్ని అవమానించిన ఫారెస్ట్ అధికారి – బూట్లు విప్పకుండా జెండా ఆవిష్కరణపై విమర్శలు
మాజీ ముఖ్యమంత్రి.. అందులోనూ కడపబిడ్డ అయిన వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కూడా ఈ ఫలితాలు చాలానే షాక్ ఇచ్చాయి. ఒకవైపు పులివెందుల మరోవైపు ఒంటిమిట్ట నియోజకవర్గాల్లో టీడీపీ భారీ విజయాన్ని అందుకుంది. ఇక వైసిపి డిపాజిట్లు కూడా దక్కలేదు. జగన్ సొంత నియోజకవర్గమైనటువంటి పులివెందులలో ఈసారి మాత్రం గట్టి షాక్ తగిలింది. ఇప్పటికే పులివెందులలో వైసీపీ అభ్యర్థి పై గెలుపొందిన లతా రెడ్డికి ఏకంగా సీఎం సతీమణి భువనేశ్వరి అభినందనలు తెలిపారు. ఫోన్ చేసి మరీ శుభాకాంక్షలు తెలపడంతో లతా రెడ్డి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఈ విజయానికి కారణం మీరే అమ్మ.. థాంక్స్ అమ్మ అని లతా రెడ్డి భువనేశ్వరి తో మాట్లాడడం జరిగింది. అలాగే మీరు ఫోన్ చేసినందుకు చాలా ఆనందంగా ఉంది అని లతా రెడ్డి అనగా… అందరం ఒకే ఫ్యామిలీ.. అదే మన టీడీపీ అని భువనేశ్వరి అన్నారు. లతా రెడ్డి మరియు భువనేశ్వరి మధ్య జరిగిన ఈ సంభాషణ అనేది రాష్ట్రవ్యాప్తంగా హైలైట్ గా మారింది.
Read also : ఎర్రకోటపై 12వసారి జెండా ఎగరేసిన ప్రధాని మోడీ – పాకిస్తాన్‌కు ఘాటు హెచ్చరిక