తెలంగాణ

కేసీఆర్ ను ఇరికించనున్న ఈటల రాజేందర్!

తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామాలు జరుగుతున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ జరుపుతున్న పీసీ ఘోష్ కమిషన్ కీలక నేతలను విచారించబోతోంది. ఇవాళ కమిషన్ ముందు హాజరుకానున్నారు మల్కాజ్ గిరి బీజేపీ ఎంపీ, తెలంగాణ మాజీ మంత్రి ఈటల రాజేందర్. 2014-2018 మధ్య కాలంలో కేసీఆర్ ప్రభుత్వంలో ఆర్థికశాఖ మంత్రిగా పని చేశారు ఈటల రాజేందర్. ఆ సమయంలోనే కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణం జరిగింది.

కాళేశ్వరంపై విచారణలో భాగంగా మాజీ మంత్రి, ఎంపీ ఈటల రాజేందర్‌ను జస్టిస్‌ పీసీ ఘోష్‌ కమిషన్‌ విచారించనుంది. బూర్గుల రామకృష్ణారావు భవన్‌లో ఉన్న కమిషన్‌ కార్యాలయంలో ఆయన విచారణకు హాజరు కానున్నారు. కాళేశ్వరం బ్యారేజీల నిర్మాణం జరుగుతున్న సమయంలో ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్న ఈటల రాజేందర్‌ కీలక కమిటీల్లో సభ్యుడిగా ఉన్నారు.ఆర్థిక, విధాన నిర్ణయాలు, బ్యాంకు గ్యారంటీల విడుదల, అంచనాల పెంపుపైనా ప్రశ్నించే అవకాశముంది.

అప్పటి కేసీఆర్ ప్రభుత్వ నిర్ణయాలపై కమిషన్‌ ఆరా తీయనుంది. ఈ మేరకు ఇప్పటికే సంబంధిత ప్రశ్నావళిని సిద్ధం చేసుకున్నట్లు తెలిస్తోంది. ఇప్పటికే కమిషన్‌ విచారణ తుది అంకానికి చేరుకుంది. ఈటల రాజేందర్‌ విచారణ అనంతరం…9న మాజీ మంత్రి హరీశ్‌రావు, 11న మాజీ సీఎం కేసీఆర్‌ను కమిషన్‌ ప్రశ్నించనుంది. ఇప్పటికే రిటైర్డ్‌ ENCలు, అధికారులు, ఇంజినీర్ల స్టేట్మెంట్లను కమిషన్‌ తీసుకుంది. అయితే పీసీ ఘోష్ కమిషన్ ముందు ఈటల రాజేందర్ ఎం చెబుతారన్నది ఆసక్తిగా మారింది. కేసీఆర్ ను ఆయన ఇరికిస్తారా లేద కాపాడుతారా అన్న చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతోంది. ఈటల విచారణలో గులాబీ పార్టీలో సెగలు రేపుతోంది.

Back to top button