తెలంగాణ

వేములపల్లిలో దారుణం.... విషపు ఆహారం తిని 100కు పైగా గొర్రెలు మృతి

రోధిస్తున్న గొర్రెల కాపరులు... సుమారు 20 లక్షల నష్టం

క్రైమ్ మిర్రర్ ప్రతినిధి, వేములపల్లి: విషపు ఆహారం తిని 100కు పైగా గొర్రెలు మృతి చెందిన సంఘటన నల్గొండ జిల్లా, వేములపల్లి మండల కేంద్రం సమీపంలో గురువారం చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళితే సూర్యాపేట జిల్లా, పెన్పహాడ్ మండలం, అన్నారం, అనంతరం, దోసపాడు గ్రామాలకు చెందిన ఉప్పునూతల సైదులు, శ్రీరాముల కోటయ్య, శ్రీరాముల గోపాలు ,ఆవుల కోటయ్య, ఆవుల వెంకన్న లు తమ గొర్రెలను గత కొన్ని రోజులుగా మండల కేంద్రం సమీపంలో మేపుతున్నారు.

Also Read:తెలంగాణ కేబినెట్ సమావేశం వాయిదా..!

కాగా బుధవారం రాత్రి 80 గొర్రెలు, గురువారం 40 గొర్రెలకు పైగా మృతి చెందినట్లు తెలిపారు. సుమారు 20 లక్షల పైగా నష్టం వాటిల్లినట్టు గొర్రెల కాపరులు వాపోయారు. భారీ సంఖ్యలో గొర్రెలు చనిపోవడంతో గొర్రెల కాపరులు రోధిస్తున్నారు. ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు.

గొర్రెలు చనిపోవడానికి కారణం విషపు ఆహారం కానీ, విషపు నీరు కానీ అయ్యుండొచ్చు అని స్థానిక పశు వైద్యాధికారి అశోక్ తెలిపారు. పోస్టుమార్టం తర్వాత గొర్రెల మృతికి కారణాలు తెలుస్తాయి అన్నారు.

Also Read:హైదరాబాద్‌లో మరో డ్రగ్స్ ముఠా అరెస్ట్..!

Also Read:మోదీని ఇంట్రెస్టింగ్ క్యూస్షన్ అడిగిన మహిళా ప్లేయర్?

Back to top button