
క్రైమ్ మిర్రర్,మహాదేవ్ పూర్ :-మండలంలోని అన్ని గ్రామాలలో పొలాల అమావాస్య పండుగను ఘనంగా జరుపుకున్నారు. తెల్లవారుజామునే నిద్రలేచి, శుచియై పోలాల అమావాస్య పూజను ప్రారంభించి పూజ పూర్తయ్యే వరకు ఉపవాసం ఉంటారు. మొదట పూజా మందిరాన్ని శుభ్రం చేసి నిత్య పూజను యధావిధిగా పూజా కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. అనంతరం పూజ గదిలో కంద మొక్కను ఉంచి ఆ మొక్కకు 9 పసుపు కొమ్మలు కడతారు, ముందుగా వినాయకుడిని పూజించి, ఆ తర్వాత కంద మొక్కలోకి మంగళ గౌరీ దేవిని గానీ, సంతాన లక్ష్మీదేవిని గానీ ఆవాహనం చేసి, షోడశోపచారాలతో పూజలు చేస్తారు. 5 రకాల పిండి వంటలను నైవేద్యంగా సమర్పిస్తారు. ఇంట్లోని మహిళలు పూజ పూర్తయిన తర్వాత ముత్తైదువులకు వాయనం ఇస్తారు.
Read also : SBI బ్యాంకు ఉద్యోగి చేతివాటం.. లక్కీ భాస్కర్ సినిమా తరహాలో స్కామ్.. చివరికి ఏమైందంటే..?