
క్రైమ్ మిర్రర్, వైరల్ న్యూస్:-ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో దసరా ఉత్సవాలు చాలా ఘనంగా జరిగాయి. చిన్నపిల్లల నుంచి పెద్ద పిల్లల వరకు ఎంతోమంది ఈ దసరా ఉత్సవాల్లో పాల్గొన్నారు. చిన్న వయసులోనే తెలంగాణ రాష్ట్రంలో అయితే ఏకంగా బతుకమ్మ సందర్భంగా ఎంతోమంది కోలాటాలు వేశారు. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా పల్లె పల్లెల నుండి పట్టణాల వరకు కూడా సాంస్కృతిక కార్యక్రమాలు చాలా అద్భుతంగా నిర్వహించారు. ఒక మాటలో చెప్పాలంటే గల్లీ నుంచి ఢిల్లీ వరకు కూడా దసరా ఉత్సవాలు ఆకాశాన్ని అంటాయి. కొన్నిచోట్ల ఈ ఉత్సవాలు గూస్ బంప్స్ తెప్పించేలా ఉన్నాయి. సోషల్ మీడియా వేదికగా దసరా ఉత్సవాలను వీడియోల రూపంలో చాలామంది కూడా పంచుకోవడం జరిగింది. ప్రతి ఏడాది రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంత ఘనంగా నిర్వహిస్తారో… ఈ ఏడాది మాత్రం అంతకుమించి జరిపారు అనేది స్పష్టంగా అర్థమవుతుంది.
Read also : జాన్పూర్లో వింత పెళ్లి.. మరుసటి రోజే వరుడు మృతి!
పల్లెటూర్ల నుంచి పట్టణాల వరకు, గల్లీ నుంచి ఢిల్లీ వరకు, చిన్నవారి నుండి పెద్దవారి వరకు … సాంస్కృతిక కార్యక్రమాలు, రావణాసురుని దహనం, లేజర్ షో, బతుకమ్మ, కోలాటాలు ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. చెడు మీద మంచి విజయం సాధించిన కారణంగా ఈ దసరా పండుగను జరుపుకుంటారు. ఇందులో భాగంగానే మన రెండు తెలుగు రాష్ట్రాలతో పాటుగా దేశవ్యాప్తంగా కూడా అన్ని రాష్ట్రాలు చాలా ఘనంగా ఈ దసరా ఉత్సవాలను జరుపుకుంటారు. నిన్న ఏ రాష్ట్రం చూసినా, ఏ నగరం చూసినా, ఏ పట్టణం చూసినా, ఏ గ్రామం చూసిన కూడా కొత్త బట్టలతో, రంగురంగుల ముగ్గులతో, ముఖంలో చిరునవ్వుతో ప్రతి ఒక్కరూ కూడా కనివిందు చేశారు. అక్టోబర్ 2 గాంధీ జయంతి పండుగ రోజునే ఈ పండుగ రావడంతో చాలామంది మాంసాహారాన్ని తినలేదు.
Read also : ప్రపంచంలోనే అతి తక్కువ జనాభా గల 10 దేశాలు ఇవే?