తెలంగాణ

రైతు భరోస పై కీలక ప్రకటన చేసిన ప్రభుత్వం?

తెలంగాణ రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం మరో శుభవార్త తెలిపింది. రైతు భరోసా పై తాజాగా కీలక ప్రకటన చేశారు. సంక్రాంతి కానుకగా సంక్రాంతి నుంచి రైతు భరోసా అమలు చేస్తున్నట్లుగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తాజాగా ప్రకటించారు. ప్రభుత్వం చేసిన ఈ ప్రకటనపై ఇప్పటికే చాలా మంది ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

నేను ఉన్నంతకాలం మీ ఆటలు సాగనివ్వను?.. ఇక టాలీవుడ్ ఏమగునో?

తాజాగా అసెంబ్లీ వేదికగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రైతు భరోసా పై చర్చించారు. గతంలో సాగు చేయనటువంటి భూములకు కూడా కెసిఆర్ ప్రభుత్వం రైతుబంధు ఇచ్చిందని మంత్రి తెలిపారు. ప్రస్తుతం రైతు భరోసా పై మండలిలో స్వల్పకాలిక చర్చ జరుగుతుంది. అయితే మరోవైపు కేటీఆర్ మాట్లాడుతూ రైతుబంధుపై సమగ్ర చర్చ జరగాలని కోరారు. రైతు భరోసాను కూడా మేమే ప్రారంభించామంటూ స్పష్టం చేశారు.

రోడ్ల విషయంలో ప్రధానికి కృతజ్ఞతలు: పవన్ కళ్యాణ్

ఏడు రోజుల నుంచి తెలంగాణలో అసెంబ్లీ మరియు శాసనమండలి సమావేశాలు జరుగుతున్నాయి. గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్ 2024 బిల్లును రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. కాగా ఇవాళ 10 గంటలకు జరగాల్సినటువంటి అసెంబ్లీ సమావేశాలు అనేవి పది నిమిషాలు ఆలస్యంగా ప్రారంభమయ్యాయి. సభను సమయానికి ఎందుకు జరపట్లేదని హరీష్ రావు నిలదీశారు.

నేను సీఎంగా ఉన్నంత కాలం బెనిఫిట్ షోలు బంద్..టికెట్ రేట్లు పెంచం

Back to top button