
క్రైమ్ మిర్రర్, తమిళనాడు:- తమిళనాడు రాజకీయాలు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. రాష్ట్రంలో జరుగుతున్న ఒక్కొక్క ఘటన తరువాత.. ఏ పార్టీ గెలుస్తుందో అనేది కూడా ఎవరికి అర్థం కావడం లేదు.
ఈ ఏడాది హీరో విజయ్ సొంత పార్టీని పెట్టి ప్రజల మధ్యకు వెళ్తూ సత్తా చాటుతూ ఉన్నాడు. భారీ స్థాయిలో కార్యక్రమాలు చేపడుతూ.. భారీ సభలను పెట్టి ప్రజలను తన వైపు తిప్పుకున్నాడు. అంత మంచిగా సాగుతుందన్న సమయంలో కరూర్ సంఘటన ద్వారా విజయ్ స్థాపించిన టీవీకే పార్టీకి బ్రేక్ పడింది. ఈ కరూర్ తొక్కిసలాట ఘటనలో భారీ విషాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో భాగంగా దాదాపు 40 మంది మృతి చెందారు. ఇక ఈ విషాద సంఘటన ప్రతిపక్ష పార్టీలకు పాజిటివ్ గా మారిపోయిందని ప్రతి ఒక్కరూ భావించారు. కానీ తాజాగా టైమ్స్ ఆఫ్ ఇండియా ఒక సర్వే నిర్వహించినట్లు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. ఈ సర్వే ప్రకారం వచ్చి ఎన్నికలలో ఏ పార్టీ ప్రభావం ఎలా ఉండబోతుంది అనేది స్పష్టంగా తెలియజేసింది.
Read also : అంగరంగ వైభవంగా శ్రీవారి బ్రహ్మోత్సవాలు.. నిండుగా హుండీ ఆదాయం!
ఈ సర్వేలో భాగంగా విజయ్ స్థాపించిన టీవీకే పార్టీ ఏకంగా 125 నుంచి 155 స్థానాలను గెలుచుకునే అవకాశం ఉందని స్పష్టం చేసింది. ఓపెన్ గా చెప్పాలంటే తమిళనాడులో 118 సీట్లు గెలిస్తే అధికారాన్ని చేపట్టవచ్చు. దీంతో ఈ సర్వే వచ్చే ఎలక్షన్లలో విజయ్ అధికారాన్ని చేపట్టబోతున్నారన్నట్లుగా స్పష్టంగా తెలియజేసింది. మరోవైపు ప్రస్తుత అధికార పార్టీ డిఎంకె కేవలం 25 నుంచి 45 స్థానాలకు పరిమితం అవుతుందని టైమ్స్ ఆఫ్ ఇండియా సర్వేలో తేలినట్టు సమాచారం. ఇక ప్రధాన ప్రతిపక్షంగా గుర్తింపు పొందినటువంటి అన్న డిఎంకె ఈసారి 13 నుంచి 30 స్థానాలు మాత్రమే గెలుచుకుంటుందని అంచనా వేసింది. ఇక మిగిలిన అన్ని పార్టీలు 2 నుంచి 5 స్థానాలు మాత్రమే దక్కించుకోగలుగుతాయని ఈ సర్వే సంచలన విషయాలు బయట పెట్టింది. అయితే ఇక్కడ టైమ్స్ ఆఫ్ ఇండియా సర్వే నిజంగా సర్వే నిర్వహించిందా లేదా అనేది మాత్రం స్పష్టంగా తెలియజేయలేదు. ఈ సర్వే కరూర్ ఘటనలో 40 మంది మరణించిన తర్వాత చేశారా లేక ముందే చేశారా అనేది కూడా స్పష్టంగా ఎవరికి తెలియదు. ఒకవేళ ఈ సర్వే నిజమైతే.. తమిళనాడు రాష్ట్రంలో నటుల ప్రభావం ఎంత బలంగా ఉందో మరోసారి స్పష్టంగా అర్థం అవుతుంది.
Read also : ఏపీకి భారీ వర్ష సూచనలు.. జర అప్రమత్తం : హోంమంత్రి అనిత