
ఆత్మకూరు,క్రైమ్ మిర్రర్:- యాదాద్రి భువనగిరి జిల్లా, ఆత్మకూరు మండలం గురువారం రోజున ట్రైని అసిస్టెంట్ కలెక్టర్(ఏసీఎల్బీ) సాత్విక్ నాయక్ మండల కేంద్రంలోని ఉపాధి హామీ కార్యాలయంలో కంప్యూటర్ విభాగం ఆపరేటర్ శ్రావణ్ కుమార్ ని పని వివరాలు అడిగి సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం పల్లెర్ల గ్రామ పంచాయతీలోని నర్సరీని సందర్శించి కూలీలు చేస్తున్న నర్సరీ పనులను మస్టర్లను పరిశీలించారు. వీరివెంటా ఉపాధి హామీ అడిషనల్ డిఆర్డీఓ గుర్రం సురేష్, ఎంపిఓ నారాగోని శ్యామ్ కుమార్ గౌడ్,ఉపాధి హామీ ఏపీఓ బొడిగే రమేష్ గౌడ్, టీఏలు ఏగు మల్లేష్ యాదవ్,జమాండ్ల యాదిరెడ్డి, పంచాయతీ కార్యదర్శి కోల మచ్చేందర్,ఏఫ్ఏ గుర్రం సురేష్,గ్రామ పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.
Crime News: లవర్ ఫ్యామిలీని ఇంప్రెస్ చేసేందుకు ప్లాన్, సీన్ కట్ చేస్తే కటకటాల్లోకి!





