
క్రైమ్ మిర్రర్, ఆంధ్రప్రదేశ్:- ఏపీసీసీ చీఫ్ షర్మిల తాజాగా కూటమి ప్రభుత్వంపై విమర్శల వర్షం కురిపించారు. ఈ ప్రభుత్వానికి గుడులపై ఉన్న శ్రద్ధ బడులపై ఎందుకు ఉండడం లేదని తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖపట్నంలోని కేజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న గురుకులాల పిల్లలను చూస్తుంటే కడుపు తరుక్కుపోతుంది అని అంటూ షర్మిలా బాగోద్వేగానికి గురయ్యారు. ఆ విద్యార్థుల శరీరాలను చూస్తుంటే అసలు వాళ్ళకి ఏం ఆహారం పెడుతున్నారో కానీ… వారిని చూసినప్పుడల్లా సోమాలియా దేశ పరిస్థితులు గుర్తుకు వస్తున్నాయని తీవ్రంగా విమర్శించారు. కూటమి ప్రభుత్వం కాస్త గుడుల గురించి ఆలోచన తగ్గించి బడుల గురించి ఆలోచించాలి అని అన్నారు.
Read also : తిరుపతిలోని మోహన్ బాబు యూనివర్సిటీకి 15 లక్షల భారీ జరిమానా
అయితే ఈ మధ్య పార్వతీపురం లోని కురుపాం గిరిజన బాలికల గురుకులంలో విద్యార్థులు అనారోగ్యానికి గురైన ఘటన ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఈ ఘటనపై సీఎం చంద్రబాబు నాయుడు కూడా ఆరా తీయడం జరిగింది. విద్యార్థులకు మెరుగైన చికిత్స అందించాలని… వెంటనే ఈ ఘటనపై విచారణ జరిపి తగిన నివేదిక ఇవ్వాలని మంత్రి సంధ్యారాణిని కూడా ఆదేశించారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో డాక్టర్లు కూడా ఎప్పటికప్పుడు విద్యార్థుల పరిస్థితులను ఆరా తీస్తున్నారు. అయినా కానీ బాధితుల సంఖ్య పెరగడంతో రేపటి నుంచి ఈ నెల 12వ తేదీ వరకు గురుకులాలకు అధికారులు వెంటనే సెలవులు ప్రకటించారు. ఈ విషయంపై తాజాగా షర్మిల స్పందిస్తూ ముగ్గురు గిరిజన బిడ్డల ప్రాణాలు పోయినందుకుగాను ఈ ఘటనపై ప్రభుత్వం బాధ్యత వహించాలి అని డిమాండ్ చేశారు.
Read also : ప్రకాశం జిల్లాలో ఘరానా మోసం… కోటి రూపాయలు స్వాహా!