
క్రైమ్ మిర్రర్, స్పోర్ట్స్ న్యూస్:- కేంద్రం తీసుకువచ్చిన కొత్త జీఎస్టీ 2.0 తో ఐపీఎల్ టికెట్ల ధరలు భారీగా పెరగనున్నాయి. ఎందుకంటే కేంద్రం దీపావళి కానుకగా కొత్త జిఎస్టిలో ఐపీఎల్ టికెట్లపై ఇకనుండి ఏకంగా 40 శాతం పన్ను అనేది పడనుంది. దీంతో ఐపీఎల్ లో తమ ఫేవరేట్ మ్యాచ్లను చూడడానికి స్టేడియానికి వెళ్ళేటటువంటి అభిమానులకు భారీ షాక్ తగలనుంది. నిన్న మొన్నటివరకు ఐపీఎల్ టికెట్ల ధరలపై 28 శాతం జీఎస్టీ మాత్రమే ఉండేది. కానీ కొత్తగా రాబోయేటువంటి GST లో 40 % పన్ను పడుతుంది. అంటే ఒకప్పుడు వెయ్యి రూపాయల టికెట్ ధర ఇప్పుడు ₹1280 ఉంటే.. రేపు కొత్త జీఎస్టీ అమల్లోకి వచ్చిన తర్వాత 1400 రూపాయలకు చేరుతుంది. అయితే ఈ జీఎస్టీలు కేవలం ఐపిఎల్ కు మాత్రమే పరిమితమని తెలుస్తుంది.
Read also : కన్నడ కాంగ్రెస్ లో బీజేపీ ముసలం!
టీమిండియా ఆడే అంతర్జాతీయ మ్యాచులకు మాత్రం టికెట్ ధరపై ఎలాంటి జీఎస్టీ పెంచలేదని.. ఇప్పుడున్న 18 శాతం జీఎస్టీ నే కంటిన్యూ అవుతుందని సమాచారం అందింది. వీటిపై ఇంకా అధికారులు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. కానీ తాజాగా రాబోయేటువంటి GST విధానాల్లో చాలావరకు ప్రజలకు మేలు కలిగించిన.. కొన్నిటిపై మాత్రం భారీగానే జీఎస్టీ పడింది. దీంతో ఐపీఎల్ మ్యాచ్ లను స్టేడియం కు వెళ్లి చూసేటువంటి అభిమానులకు ఇది పెద్ద షాక్ అనే చెప్పాలి. కేంద్రం తీసుకువచ్చేటువంటి కొత్త GST ఈనెల 22వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దీపావళి కానుకగా ప్రజలకు కొన్ని వస్తువులపై జిఎస్టి శాతాలను తగ్గించారు. ఈనెల 22వ తేదీ నుంచి ఎలక్ట్రిక్ వస్తువులపై, ఆహారపు వస్తువులపై, బట్టలపై, ఇంటికి వాడేటువంటి పరికరాలపై… ఇలా చాలా వాటిపై జిఎస్టి అనేది తగ్గనుంది. దీంతో చాలానే వస్తువులు తక్కువ ధరలోనే లభిస్తాయి. ఈసారి దీపావళికి ముందుగానే ప్రజలు సంబరాలు చేసుకుంటారని కేంద్రం ఇప్పటికి పలు రకాలుగా ప్రచారాలు చేస్తుంది.
Read also : ఉద్యోగం కోసం పక్కా ప్లాన్ చేసాడు.. నాన్నని చంపాడు.. కానీ వర్కౌట్ అవ్వలేదు?