
క్రైమ్ మిర్రర్, సినిమా న్యూస్:-అనసూయ భరద్వాజ్.. ఈ పేరు తెలియని వారు ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో లేరు. ఒకవైపు టీవీ షోల లో మరోవైపు సినిమా ఇండస్ట్రీలో బిజీబిజీగా జీవితాన్ని గడుపుతుంది అనసూయ. అలాంటి అనసూయకు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ఎంతోమంది ఫ్యాన్స్ ఉన్నారు. ఈ అందాల భామ కు తెలుగు సినిమా ఇండస్ట్రీలో వరుసగా అవకాశాలు వస్తూనే ఉన్నాయి. మొదట యాంకర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు అనసూయ. ఆ తరువాత మెల్లిమెల్లిగా సినిమాల్లో నటిస్తూ తనకంటూ ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ ను సంపాదించుకుంది. జబర్దస్త్ ద్వారా అనసూయ మరింత పాపులర్ అయింది. యాంకరింగ్ తో పాటుగా సినిమా ఇండస్ట్రీలో తన నటన అలాగే తన అందంతో ప్రతి ఒక్కరినీ మెప్పిస్తూ ఇంతవరకు రాణించగలిగింది. అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో అనసూయ కొన్ని సంచలన విషయాలను బయటపెట్టింది. తన జీవితంలో కలిగిన ప్రేమల గురించి మాట్లాడుతూ… నా లైఫ్ లో ఒక బాయ్ ఫ్రెండ్ ఉండేవాడు.. తననే నేను పెళ్లి చేసుకున్నాను అని తెలిపారు. అయితే ఆ తరువాత మరో యాంకర్ ఒకవేళ ఏ హీరో తో మీరు డేటింగ్ చేస్తారో చెప్తారా?.. అని అడిగితే వెంటనే ఓపెన్ గా రామ్ చరణ్ పేరు చెప్పేసింది. దీంతో సోషల్ మీడియాలో ఈ విషయం సంచలనంగా మారింది. ఇప్పటికే రామ్ చరణ్ నటించినటువంటి రంగస్థలం సినిమాలో అనసూయ రంగమ్మ అత్తగా నటించి మంచి పేరు తెచ్చుకున్నారు. ఒకవేళ నిజంగానే రామ్ చరణ్ కి ఈపాటికి పెళ్లి కాకుండా ఉంటే అనసూయ కచ్చితంగా రాంచరణ్ తో డేటింగ్ చేసేదేమో. ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోయిన్లు కూడా ఇలానే తయారయ్యారు.
Read also : త్వరలోనే చికెన్ షాపులకు కూడా లైసెన్సులు.. మాంసాభివృద్ధి సంస్థ కీలక నిర్ణయం..!
Read also : నేడే విచారణ… నిర్ణయమా?.. లేక వాయిదానా?





