తెలంగాణ

మైనర్లు వాహనం నడిపిన, వారిని ప్రోత్సహించిన కట్టిన చర్యలు!

కోదాడ, క్రైమ్ మిర్రర్:- మైనర్లు ద్విచక్ర వాహనాలు నడిపితే బాధ్యులపై చర్యలు తప్పవని కోదాడ పట్టణ సిఐ శివశంకర్ అన్నారు. శనివారం కోదాడ పట్టణంలో వివిధ ప్రధాన కూడలి వద్ద మైనర్ డ్రైవింగ్ చేసినటువంటి వ్యక్తులు వారి తల్లిదండ్రులు అందరికీ పట్టణ పోలీస్ స్టేషన్ లో కౌన్సిలింగ్ ఇచ్చి అనంతరం ఆయన మాట్లాడారు. రోడ్డు భద్రత, హెల్మెట్‌ ధరించడం గురించి అవగాహన కలిగించారు. మైనర్లకు వాహనాలు ఇస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రతి ఒక్క వాహనదారుడు ట్రాఫిక్‌ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలన్నారు. లైసెన్స్‌, సి-బుక్‌, ఇన్సూరెన్స్‌, హెల్మెట్‌ తప్పనిసరిగా ఉండాలన్నారు. హెల్మెట్‌ ధరించడం వల్ల రోడ్డు ప్రమాదాల్లో 90 శాతం ప్రాణాపాయం నుంచి బయట పడవచ్చునని చెప్పారు. కుటుంబ శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరూ ద్విచక్ర వాహనాలపై వెళ్లేటప్పుడు హెల్మెట్‌ ధరించాలని సూచించారు. వాహనదారులు డ్రైవింగ్‌ లైసెన్సు లేకుండా వాహనాలను నడిపితే వారిపై చట్టరీత్యా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. వాహనదారులు డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని వాహనదారుడు తప్పనిసరిగా లైసెన్స్ కలిగి ఉండాలని సూచించారు. త్రిబుల్ రైడింగ్ పాల్పడిన.. ఆపోజిట్ డ్రైవింగ్ చేసిన కఠిన చర్యలు తప్పవు అన్నారు. అనంతరం వాహనదారుల తో ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో పట్టణ ఎస్ఐ సుధీర్ కుమార్, ట్రాఫిక్ ఎస్ఐ అంజిరెడ్డి, పోలీస్ సిబ్బంది, వాహన చోదకులు, తల్లిదండ్రులు, తదితరులు పాల్గొన్నారు.

Read also : డిప్యూటీ సీఎం.. మీరు జీవితాంతం కూటమిలోనే ఉండండి : అంబటి రాంబాబు

Read also : కార్యక్రమాల్లో యాక్టివ్ గా లేరని ఎమ్మెల్యేలపై ఆగ్రహం వ్యక్తం చేసిన సీఎం!

Back to top button