
క్రైమ్ మిర్రర్, తెలంగాణ:- ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో తొలి విడత ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. దాదాపు 37,562 కేంద్రాల్లో ఈరోజు ఎన్నికలు జరగనున్నాయి. దాదాపు ఈ తొలి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్లో భాగంగా 56 లక్షల మంది ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. 3834 సర్పంచ్ స్థానాలకు గాను 12,960 మంది బరిలో నిలిచారు. ఇక 27628 వార్డు నెంబర్ల స్థానాలకు గాను 65,455 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. అంటే ఈ ఒక్క రోజే దాదాపు 80000 మంది అభ్యర్థుల భవిష్యత్తును ఓటర్లు తేల్చనున్నారు. ఇక ఈరోజు మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఈ పోలింగ్ అనేది కొనసాగుతుందని ఇక ఆ తర్వాత రెండు గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేసి విజేతలను అధికారులు ప్రకటిస్తారు.
Read also : Prawns: రొయ్యలు తినడం వల్ల ఎన్ని లాభాలో తెలుసా?
ఇక వీటితో పాటే ఉప సర్పంచ్ ఎన్నికలు కూడా జరగనున్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తమ గ్రామాల అభివృద్ధికి తోడ్పడే వారిని ఎంచుకొని ఓటు వేయాలని కోరుతున్నాం. ఎందుకంటే ప్రతి పంచాయతీలోని గ్రామ అభివృద్ధి మరియు ప్రజల సమస్యలను తీర్చడంలో సర్పంచులదే కీలక పాత్ర ఉంటుంది. కావున ప్రతి ఒక్కరూ కూడా డబ్బుకో, ఆల్కహాల్ కో లేదా బిర్యానీ లాంటి వాటికి ఆశపడకుండా జాగ్రత్తగా గ్రామాన్ని అభివృద్ధి చేస్తాడని మీకు అనిపించిన వ్యక్తికి ఓటు వేయాలని కోరుతున్నాం. కులం మరియు బంధుత్వం అంటూ ఒక అసమర్థుడికి ఓటు వేస్తే మాత్రం అంతే గతి. గ్రామంలో 24 గంటల పాటు అందుబాటులో ఉండి సమస్యలపై స్పందించే నాయకుడిని ఎన్నుకోవాలని.. ఈ సర్పంచ్ ఎన్నికలలో యువతని కీలకపాత్ర ఉంటుందని చెబుతున్నాం.
Read also : Shocking: ఫస్ట్ నైట్ రోజే షాక్.. విడాకులు కోరిన వధువు





