క్రైమ్

జైలుకు అఘోరీ.. ఆ పూజల కేసులో అరెస్ట్

కొంతకాలంగా తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన లేడీ అఘోరీ ఎట్టకేలకు కటకటాల పాలవుతోంది. యూపీలో అఘోరీని అరెస్ట్ చేసిన పోలీసులు.. మోకిలా పీఎస్ కు తీసుకువచ్చారు. నిన్న యూపీలో అరెస్ట్ అయిన అఘోరీని హైదరాబాద్ తరలించారు. దాంతో మోకిలా పీఎస్ వద్ద ఉత్కంఠ వాతావరణం నెలకొంది. అఘోరీ, వర్షిణిలకు సనాతనవాదుల నిరసన సెగ తగిలే అవకాశాలున్నాయని తెలుస్తోంది.

ఇక అఘోరీకి వ్యతిరేకంగా ట్రాన్స్‌జెండర్స్‌ పెద్ద ఎత్తున ఆందోళనకు దిగే అవకాశముందని పోలీసులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో భద్రతను కట్టుదిట్టం చేశారు. క్షుద్ర పూజల పేరుతో ఓ మహిళను అఘోరీ బెదిరించినట్లు కేసు నమోదైంది. తల్వార్, గన్‌ తో బెదిరించినట్లు ఓ బాధితురాలు ఫిర్యాదు చేసింది. పూజలు చేస్తానంటూ అఘోరీ బాధితురాలి దగ్గర 10 లక్షలు తీసుకున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో అఘోరీ, శ్రీ వర్ణిణిని అరెస్ట్‌ చేసి మోకిలా పీఎస్ కు తీసుకువచ్చారు.

Back to top button