తెలంగాణ

త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు.. మంత్రి పొంగులేటి కీలక వ్యాఖ్యలు!

Local Body Elections In Telangana: తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు రంగం సిద్ధమైందని రెవెన్యూ , గృహ నిర్మాణ, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. ఈ నెల చివరిలోపు స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్‌ రాబోతుందన్నారు. త్వరలో ఎన్నికల తేదీలు ప్రకటిస్తారని చెప్పారు. ఖమ్మం జిల్లాలో పర్యాటించిన ఆయన, స్థానిక సంస్థల ఎన్నికలపై జూన్16న జరిగే కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిపారు. తొలుత ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు జరుగుతాయన్నారు. ఆ తర్వాత  సర్పంచ్‌, మున్సిపల్‌ ఎన్నికలు ఉంటాయన్నారు పొంగులేటి.

ఎన్నికలకు సిద్ధం కావాలి!

అన్ని గ్రామాల్లో నాయకుల మధ్య సఖ్యత ఉండాలని మంత్రి పొంగులేటి చెప్పారు. నాయకులు అంతా ప్రజా సమస్యల పరిష్కారానికి తొలి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ఎన్నికలకు మరో 15 రోజులు గడువు ఉన్న నేపథ్యంలో.. అన్ని గ్రామాల్లోని లోటు పాట్లను సరిచేసుకోవాలన్నారు. రిజర్వేషన్ల ఆధారంగా ఎన్నికల్లో గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్న అభ్యర్థులను మాత్రమే బరిలోకి దింపుతామని పొంగులేటి ప్రకటించారు.

రేపటి నుంచి రైతు భరోసా.. 

అటు రైతు భరోసా రేపటి నుంచి ఇవ్వనున్నట్లు తెలిపారు. రైతు భరోసా ఇప్పటికే రెండు సార్లు ఇవ్వగా, రేపటి నుంచి  మూడోసారి ఇస్తామన్నారు. దేశంలో వరి ధాన్యం పండించిన రాష్ట్రాల్లో తెలంగాణ మొదటి స్థానంలో ఉందన్న ఆయన.. ఉచిత కరెంట్, రైతు భరోసా, నాణ్యమైన విత్తనాలు అందిస్తున్నాట్లు తెలిపారు.  రాష్ట్రంలో రైతులు అందరూ సుఖసంతోషాలతో ఉండాలని భగవంతుడు ఆశీర్వదించాలని మంత్రి పొంగులేటి కోరుకున్నారు.a

Read Also: చిన్న కొడుకును హైదరాబాదులోనే చదివిస్తున్న పవన్ కళ్యాణ్!.. స్కూల్ విశేషాలు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే?

Back to top button