
క్రైమ్ మిర్రర్, జాతీయ న్యూస్:- ఢిల్లీ పేలుడు ఘటన ప్రస్తుతం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుంది. ఢిల్లీలోని ఎర్రకోట వద్ద జరిగిన బాంబు పేలుడు గురించి ప్రస్తుతం దేశం మొత్తం కూడా మాట్లాడుకుంటుంది. ఈ బాంబు పేలుడు ఎలా జరిగింది?.. అనే ప్రశ్నలు ప్రతి ఒక్కరిలోనూ ఆలోచింపజేస్తున్నాయి. తాజాగా హోం మంత్రి అమిత్ షా కూడా ఈ విషయంపై పోలీసులు పూర్తి విచారణ చేసిన తర్వాతనే ఏదైనా చెప్పగలమని అంటున్నారు. ఇప్పటికే ఈ ఢిల్లీ పేలుడు ఘటనపై రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు దేశంలోని ప్రముఖ రాజకీయ నాయకులతో పాటు సినీ రంగా నటులు కూడా సంతాపం తెలిపారు. ఈ పేలుడు ఘటనలో గాయపడిన ప్రతి ఒక్కరు కూడా త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లుగా తెలిపారు. మన దేశ రాజధాని అయినటువంటి ఢిల్లీలో… అది కూడా ఎర్రకోట వద్ద బాంబు పేలుడు ఘటన చోటు చేసుకోవడంతో ప్రతి ఒక్కరు కూడా షాకు కు గురయ్యారు. ఈ ఘటన తర్వాత మన భారతదేశ వ్యాప్తంగా ప్రముఖ ముఖ్య నగరాలు అయినటువంటి హైదరాబాద్, బెంగళూరు, ముంబై, చెన్నై, విశాఖపట్నం వంటి అన్ని నగరాలలో కూడా అధికారులు హై అలెర్ట్ ప్రకటించారు. మరోవైపు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో కూడా భద్రత బలగాలు విస్తృత స్థాయిలో తనిఖీలు చేపడుతున్నారు. ఈ ఘటన గురించి పూర్తి వివరాలు రేపు తెలిసే అవకాశాలు అయితే ఉన్నాయి. ఈ బాంబు పేలుడు ద్వారా ఆ చుట్టుపక్కల పరిసరాలలో దాదాపు కారులన్నీ కూడా తునాతుకలు అయ్యాయి. ఇప్పటికే 13 మంది వరకు మృతి చెందినట్లు.. చాలామంది వరకు గాయపడినట్లు సమాచారం.
Read also : పెద్దిర్ పహాడ్ లో చిరుతపులుల సంచారం.. భయాందోళనలో గ్రామస్తులు?
Read also : సంక్రాంతికి ఊరెళ్ళాలనుకుంటున్నారా?.. ఇప్పుడే టికెట్స్ బుక్ చేసుకోండి!





