తెలంగాణ

టీచర్ అవమానం..విద్యార్థిని ఆత్మహత్యయత్నం…!

క్రైమ్ మిర్రర్ / వికారాబాద్ జిల్లా ప్రతినిధి:- టీచర్ అవమానించడంతో ఓ విద్యార్థిని హాస్టల్ భవనం పై నుండి దూకి ఆత్మహత్యాయత్నం చేసుకున్న సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.పూర్తి వివరాల్లోకి వెళ్తే వికారాబాద్ జిల్లా మర్పల్లి మండలానికి చెందిన ఓ బాలిక జిల్లా కేంద్రంలోని కొత్తగాడి సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో 10వ తరగతి చదువుతూ హాస్టల్లో ఉంటుంది.ఈ క్రమంలో గత నెల 24న హాస్టల్ భవనం పైనుంచి దూకి ఆత్మహత్యకు పించింది తీవ్ర గాయాలు కావడంతో విద్యార్థినిని స్థానిక ప్రవేట్ ఆసుపత్రికి టీచర్స్ తరలించారు.

భవనంపై నుంచి దూకి ఆత్మహత్యయత్నానికి పాల్పడిందని తెలిస్తే పోలీస్ కేసు అవుతుందని భయంతో టీచర్స్ మెట్లపై నుంచి జారీ పడటం వల్లే గాయాలైనట్లు చెప్పి చికిత్స చేయించారని విద్యార్థిని తల్లిదండ్రులు ఆరోపించారు. పాఠశాల వైస్ ప్రిన్సిపాల్ విద్యార్థినిని అవమానిస్తూ మాట్లాడడం వల్లే మనస్థాపానికి గురై ఆత్మహత్యయత్నానికి విద్యార్థిని ప్రయత్నించిందని తల్లిదండ్రులు చెప్పుకొచ్చారు. మా కూతురు చికిత్సకు రూపాయలు లక్షకు పైన ఖర్చయినట్లు తెలిపారు.

ఇట్టి ఘటన పై కలెక్టర్ స్పందించి బాధితులైన టీచర్ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని హాస్టల్ ఎదుట బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. విద్యార్థి సంఘాల నాయకులు మద్దతుగా నిలిచి ధర్నా చేయడం జరిగింది.ఇదే విషయంపై వైస్ ప్రిన్సిపల్ సంప్రదించగా మాట్లాడడానికి వారు నిరాకరించారు.ఆమెను వెంటనే సస్పెండ్ చేయాలన్నారు.సంఘటన స్థలానికి వచ్చిన పోలీసులు,పోలీస్ స్టేషన్ కు వచ్చి బాధ్యులపై ఫిర్యాదు చేస్తే తప్పు చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చి వారిని పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లారు. ఇదిలా ఉంటే కళాశాల ప్రిన్సిపల్ మాత్రం ఈ సంఘటనపై నాకు ఎలాంటి సమాచారం లేదని, కేవలం అమ్మాయి కాలుజారి కింద పడింది అని మాత్రమే నాకు చెప్పారని చెప్పడం గమనార్హం.

అధైర్య పడొద్దు..విద్యార్థినీతో ఫోన్లో మాట్లాడిన స్పీకర్….!

వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని కొత్తగడి సాంఘిక సంక్షేమ బాలికల హాస్టల్ లో టీచర్ వేదింపులు భరించలేక 10వతరగతి విద్యార్థిని ఆత్మహత్య ప్రయత్నం చేసుకుందని శాసన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ దృష్టికి రావడం జరిగింది.అందుకు వెంటనే స్పందించిన ఆయన విద్యార్థిని పరిస్థితి ఎలా ఉంది,ఆత్మహత్యా ప్రయత్నం చేసుకోవడానికి గల కారణాలు ఏంటి అని వెంటనే తెలుసుకోవాలని అధికారులను ఆదేశించారు. అలాగే హాస్టల్ దగ్గర విద్యార్థిని తల్లిదండ్రులు ధర్నా చేస్తున్నారని తెలియడంతో స్పీకర్ గారి ఆదేశాల మేరకు సంఘటన స్థలానికి వెళ్ళిన వికారాబాద్ మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ చిగుళ్లపల్లి రమేష్ కుమార్ విద్యార్థినితో మాట్లాడి ఏం జరిగిందో అడిగి తెలుసుకున్నారు. అలాగే పాఠశాల ప్రిన్సిపల్ తో మాట్లాడి జరిగిన సంఘటనపై ఆరా తీయడం జరిగింది. ఈ సందర్భంగా స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ స్వయంగా విద్యార్థినితో ఫోన్లో మాట్లాడి మీకు నేను అండగా ఉంటానని, ప్రభుత్వం చట్టపరమైన చర్యలు తీసుకొని బాధ్యులను శిక్షిస్తుందని భరోసా ఇచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button