తెలంగాణ

నాగోల్‌లో షటిల్ ఆడుతూ గుండెపోటుతో యువకుడు మృతి

హైదరాబాద్‌ (క్రైమ్ మిర్రర్):-హైదరాబాద్
నగరంలోని నాగోల్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది. షటిల్ ఆట ఆడుతుండగా 25 ఏళ్ల యువకుడు రాకేష్ అకస్మాత్తుగా కుప్పకూలి మృతిచెందాడు. రాకేష్‌ స్వస్థలం ఖమ్మం జిల్లా తల్లాడ మండలం. ఉద్యోగరీత్యా హైదరాబాద్‌లో ఉంటూ ఫిట్‌నెస్‌ కోసం రోజూ షటిల్ ఆడతాడని తెలిసింది. మామూలుగా నిత్యాచర్యలో భాగంగా సోమవారం షటిల్ ఆడుతున్న సమయంలో ఆకస్మికంగా ఛాతిలో నొప్పితో కుప్పకూలి అపస్మారక స్థితికి చేరాడు.
అతని స్నేహితులు తక్షణమే సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. గుండెపోటు వల్లే ఈ హఠాన్మరణం జరిగిందని ప్రాథమికంగా భావిస్తున్నారు. ఈ ఘటనతో రాకేష్ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. చిరునవ్వుతో అందరిని పలకరించే రాకేష్ ఆకస్మిక మృతి సహచరుల్లో, స్నేహితుల్లో విషాదాన్ని మిగిల్చింది. పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది.

ఫిడే మహిళల చెస్‌ వరల్డ్‌కప్‌ విజేతగా దివ్య

యరుగండ్లపల్లిలో అక్రమ నిర్మాణం – అధికార నిర్లక్ష్యంపై ఆరోపణలు

Back to top button