ఆంధ్ర ప్రదేశ్

ఇచ్చిన సమయం చాలు.. ఇక సమరమే – మరో పెద్ద పోరాటానికి వైసీపీ ప్లాన్‌

క్రైమ్ మిర్రర్, పొలిటికల్ బ్యూరో:- కూటమి అధికారంలోకి వచ్చి ఏడాది అయ్యింది. దీంతో.. అధికార పార్టీకి ఇచ్చిన సమయం చాలు… ఇక సమరమే అంటోంది వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ. వెన్నుపోటు దినం కార్యక్రమం విజయవంతం కావడంతో… జోష్‌లో ఉంది. ప్రభుత్వంపై మరో పోరాటానికి ప్లాన్‌ చేస్తోంది. ఆ పోరాటం భారీ స్థాయిలో ఉండేలా వ్యూహరచన చేస్తోందట వైసీపీ. మరి ఆ పోరాటం ఎప్పుడు.. ఎక్కడ చేయబోతోంది..?

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాదైనా.. ఇచ్చిన హామీలు అమలు చేయలేదని వైసీపీ అంటోంది. సూపర్‌ సిక్స్‌ హామీలు ఇచ్చి… గాలికి వదిలేశారని మండిపడుతోంది. అంటే… అధికార పార్టీలు పాలనకు ఏడాది పూర్తైన సదర్భంగా విజయోత్సవాలు నిర్వహిస్తే… వైసీపీ మాత్రం వెన్నుపోటు దినం పేరుతో నిరసనకార్యక్రమాలు చేపట్టింది. పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో… నిరసన కార్యక్రమం విజయవంతమైందని చెప్తోంది వైసీపీ. ఇదే ఊపులో.. ప్రభుత్వంపై పోరాటాన్ని తీవ్రం చేసి.. ప్రజల్లో అధికార పార్టీపై వ్యతిరేకత పెంచాలని భావిస్తోంది.

జూన్‌ నెలాఖరులోగా… రౌండ్‌ టేబుల్‌ సమావేశం నిర్వహించాలని భావిస్తోంది వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ. అన్ని ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో ఈ రౌండ్‌టేబుల్‌ సమావేశాలు పెట్టి… ప్రముఖులు, మేథావులను ఆహ్వానించాలని నిర్ణయించింది. ఆ సమావేశం ప్రభుత్వం వైఫల్యాలను గట్టిగా ఎండగట్టాలని భావిస్తోంది. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ హాయంలో జరిగిన సంక్షేమ పథకాలను తుంగలో తొక్కారని… సూపర్‌ సిక్స్‌ పథకాలు అమలు చేయడంలేదని… ప్రముఖులు, విద్యార్థులు, మహిళలు, రైతులు, యువతతో చెప్పించాలని ప్లాన్‌ చేసింది. వెన్నుపోటు దినం విజయవంతం కావడంతో.. దీనికి కొనసాగింపుగా… ఈ నెలాఖరులో రౌండ్‌ టేబుల్‌ సమావేశాలు నిర్వహించాలని పిలుపునిచ్చింది వైసీపీ. ఈ కార్యక్రమాన్ని కూడా సక్సెస్‌ చేయాలని పార్టీ నేతలు, కార్యకర్తలను కోరింది.

నేను విన్నాను.. నేను ఉన్నాను – జగన్‌ డైలాగులు చెప్తున్న కేటీఆర్‌

ఆలోచన కేసీఆర్‌ది – ఆచరణ జగన్‌ది – వాట్‌ ఏ స్ట్రాటజీ బాస్‌..!

Back to top button