ఆంధ్ర ప్రదేశ్తెలంగాణరాజకీయం

నేను విన్నాను.. నేను ఉన్నాను – జగన్‌ డైలాగులు చెప్తున్న కేటీఆర్‌

క్రైమ్ మిర్రర్, పొలిటికల్ బ్యూరో: :-
తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో ఏం జరుగుతోంది..? అధికార పార్టీపై చేసే పోరాటాల్లో కేసీఆర్‌ ఫార్ములాను వైఎస్‌ జగన్‌ ఫాలో అవుతున్నారన్న వార్తలు వస్తున్నాయి. మరోవైపు… జగన్‌ చెప్పే ఫేమస్‌ డైలాగులను.. కేటీఆర్‌ వల్లెవేస్తున్నారు. ఇవన్నీ చూస్తే… అసలు ఏం జరుగుతోంది…? ఏం జరగబోతోంది..? మాకు తెలియాలి..? అంటూ మరో డైలాగ్‌ కొడుతున్నారు చాలా మంది.

నేను విన్నాను-నేను ఉన్నాను.. ఇది వైఎస్‌ జగన్‌ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వాడిన ఫేమస్‌ డైలాగ్‌. ప్రజాసంకల్ప పాదయాత్రలో వైఎస్‌ జగన్‌ ఈ డైలాగ్‌ను పదే పదే చెప్పారు. బహిరంగ సభలో ఈ డైలాగ్‌తోనే ప్రజలకు భరోసా ఇచ్చారు. ఈ డైలాగ్‌.. 2019లో వైఎస్‌ జగన్‌ను సీఎంను చేసిందంటే ఆశ్చర్యం లేదు. అయితే… జగన్‌ డైలాగ్‌ను ఇప్పుడు కేటీఆర్‌ పలుకుతున్నారు. ఒక ఇంటర్వ్యూలో కేటీఆర్‌ నేను విన్నాను-నేను ఉన్నాను అంటూ జగన్‌ డైలాగ్‌ చెప్పారని.. సోషల్‌ మీడియో ఏకరువుపెడుతోంది. ఇది .. తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీసింది.

కేసీఆర్‌ నోటివెంట జగన్‌ డైలాగ్‌ రావడం వెనుక రాజకీయ వ్యూహం ఉందా..? అన్న ఆలోచన వస్తోంది. తెలంగాణలోని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలను ఆకర్షించేందుకు కూడా కేటీఆర్‌ ఈ డైలాగ్‌ వాడి ఉండొచ్చని అంటున్నారు. లేదా… జగన్‌తో ఉన్న స్నేహాన్ని… ఈ డైలాగ్‌ ద్వారా మరోసారి వ్యక్తపరిచారని కూడా అనుకోవచ్చు. అంతేకాదు… కాంగ్రెస్‌ ప్రభుత్వంలో తెలంగాణ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని బీఆర్‌ఎస్‌ ఆరోపిస్తోంది. ఈ క్రమంలో.. తెలంగాణ ప్రజలకు నేను ఉన్నారు అంటూ… చెప్పే ప్రయత్నం కేటీఆర్‌ ఇలా చేశారని కొందరు అంటున్నారు. నేను విన్నాను-నేను వున్నాను అనే డైలాగ్‌ వాడటం వల్ల… తన ఉద్దేశం ప్రజల్లోకి త్వరగా వెళ్తుందన్న ఆలోచన కూడా కేటీఆర్‌ చేసుండొచ్చన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఏది ఏమైనా… జగన్‌ డైలాగ్‌ను కేటీఆర్‌ వాడటం.. హైలెట్‌. అందుకే సోషల్‌ మీడియాలో… విస్తృతంగా చర్చ జరుగుతోంది. ఒకరంగా చెప్పాలంటే.. ఇది కూడా ఒక ప్రచారమే. కేటీఆర్‌ వ్యూహాత్మకంగానే జగన్‌ ఇమేజ్‌ను వాడుకుంటున్నారన్న చర్చ కూడా జరుగుతోంది.

ఆలోచన కేసీఆర్‌ది – ఆచరణ జగన్‌ది – వాట్‌ ఏ స్ట్రాటజీ బాస్‌..!

జగన్‌ అరెస్ట్‌ కుదరదన్న చంద్రబాబు..? – ఎందుకో తెలుసా..!

Back to top button