
క్రైమ్ మిర్రర్, తెలంగాణ: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు మరి కొద్ది రోజులు మాత్రమే సమయం ఉంది. ఈలోపే కాంగ్రెస్ పార్టీ నేతకు బిగ్ షాక్ తగిలిందనే చెప్పాలి. ఎందుకంటే జూబ్లీహిల్స్ ఉపఎన్నిక రేసులో ముందు వరుసలో ఉన్నటువంటి కాంగ్రెస్ నేత నవీన్ యాదవ్ పై క్రిమినల్ కేసు నమోదు కావడమే దీనికి ముఖ్య కారణం. ఈసీ నిబంధనలను ఉల్లంఘించి ఓటర్ కార్డులను పంపిణీ చేయడంతో అధికారులు ఈ విషయంపై చర్యలకు దిగారు. ఓటర్లందరినీ కూడా ప్రలోభాలకు గురి చేసే చర్యగా దీనిని భావించి, మధురానగర్ పోలీసులకు ఎన్నికల అధికారి రజినీకాంత్ ఫిర్యాదు చేశారు. దీంతో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక రేసులో ఉన్నటువంటి కాంగ్రెస్ నేత నవీన్ యాదవ్ పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
Read also : కారు ప్రమాదానికి ఈమె కారణం అంటూ సోషల్ మీడియాలో రచ్చ!
ఇప్పటికే ఈ విషయంపై బీజేపీ ఎంపీ రఘునందన రావు SEC కి ఫిర్యాదు కూడా చేశారు. ఇలాంటి పనులు చేయడం తప్పు కాదా?.. అని ప్రశ్నించారు. కాంగ్రెస్ అభ్యర్థి పోస్టర్లు అలాగే బ్యానర్లు చూపిస్తూ ఓటర్లకు EPIC కార్డులు పంపిణీ చేయడం ఏంటని… ఇదీ కాంగ్రెస్ పరిపాలన తీరు అని ప్రశ్నిస్తూ… ఈ విషయంపై ఇప్పటికే SEC కి కూడా ఫిర్యాదు చేశానని స్పష్టం చేశారు. అసలు వారికి ఈ EPIC కార్డులు ఎలా వచ్చాయి?.. పోలీసులు, జిహెచ్ఎంసి కమిషనర్ ఏం చేస్తున్నారు?.. అని ప్రశ్నించారు. ఇది ఓటర్ ఐడి కార్డు చోరీ కాదా?.. అని ప్రశ్నిస్తూనే కాంగ్రెస్ ప్రభుత్వం పై తీవ్రంగా మండిపడ్డారు.
Read also : తెలంగాణ ప్రజలకు విజ్ఞప్తి… ఇకపై అలా చేస్తే కఠిన చర్యలు!