
క్రైమ్ మిర్రర్, జాతీయ న్యూస్ :- మన భారతదేశంలో దీపావళి పండుగ జరుపుకోవడానికి మరి కొద్ది రోజులు మాత్రమే ఉన్నాయి. ప్రతి ఏడాది కూడా మన దేశంలో చాలా ఘనంగా దీపావళి పండుగ జరుపుతూ ఉంటారు. ఇందులో చిన్న పిల్లలు, పెద్దవారు అని తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా దీపాలు వెలిగిస్తూ, బాంబులు కాల్చుతూ రావణాసురుడి దిష్టిబొమ్మను కాల్చి వేస్తుంటారు. అయితే ఈ పండుగ రోజు ప్రతి ఒక్కరు కూడా ఇల్లను శుభ్రం చేసుకుంటూ ఇంటిలో ఏమైనా పాత వస్తువులు ఉంటే వాటిని బయటపడి వేస్తుంటారు. అయితే ఈసారి దీపావళి పండుగ రోజున ఓసారి ఇప్పుడు చెప్పే విషయాన్ని ఆలోచించండి!.. మీకు పనికిరాని వస్తువులు, వేరొకరికి పనికొస్తాయంటే మీరు నమ్ముతారా?.. అవును మీరు వద్దనుకునే ఆ వస్తువులు.. బయట నిరుపేదలు ఎంతోమందికి ఉపయోగపడతాయి. బట్టలు మొదలుకొని పుస్తకాలు, ఆట బొమ్మలు, వంట సామాగ్రి, పాదరక్షకులు, ఎలక్ట్రానిక్ వస్తువులు, దుప్పట్లు ఇలా ఎన్నో వస్తువులు మీకు పనికి రావచ్చు కానీ… బయట ఎంతో మంది నిరుపేదలకు ఇవి కచ్చితంగా ఉపయోగపడతాయి. కాబట్టి ఇలాంటి అనవసరపు వస్తువులను మీరు ఇతరులకు ఇచ్చేందుకు ముందుకు రాండి. బయట ఎన్నో అనాధాశ్రమాలు, ఎన్నో NGO లు వీటిని తీసుకోవడానికి రెడీగా ఉన్నాయి. అనాధలకు మీరు చేసేటువంటి దానాలు ఎంతగానో ఉపయోగపడతాయి. ఆర్థిక సాయం, ఆహార సాయం చేయలేకపోయినా కనీసం ఇలాంటి పనికిరాని వస్తువులైన వారికి ఇవ్వడం వల్ల మీకు ఎంతో ఆత్మసంతృప్తి కలుగుతుంది అని కొంతమంది విశ్లేషకులు ఈ విషయాలను మా క్రైమ్ మిర్రర్ న్యూస్ వెబ్సైట్ ద్వారా పంచుకున్నారు. కాబట్టి ఎంతమంది మీకు పనికిరాని వస్తువులను దానం చేయడానికి రెడీగా ఉన్నారో వారు ఈ కింద కామెంట్ రూపంలో తెలియజేయండి.
Read also : విద్యా వ్యవస్థను పూర్తిగా నాశనం చేశారు.. గిట్టుబాటు ధరలు కూడా లేవు : వైయస్ జగన్
Read also : ఆ పిల్లలను చూస్తుంటే కడుపు తరుక్కుపోతుంది : షర్మిల