
చిట్యాల, క్రైమ్ మిర్రర్:- చిట్యాల మండలం, వెలిమినేడు గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన “ఫ్యాబెక్స్” స్టీల్ స్ట్రక్చర్ కంపెనీని ఎమ్మెల్యే వేముల వీరేశం ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే వీరేశం మాట్లాడుతూ.. నిరుద్యోగ యువతకు ఉద్యోగాలుగా.. కార్మికులకు ఇతర కంపెనీ సిబ్బంది గా నియమించాలని అన్నారు. ఏర్పాటు చేసిన స్టీల్ కంపెనీ వల్ల ఎలాంటి పొల్యూషన్ లేకుండా స్థానిక ప్రజలకు పర్యావరణానికి హాని కలగకుండా కంపెనీ నిర్వహించాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో జగ్గయ్యపేట ఎమ్మెల్యే శ్రీరాం తాతయ్య , మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకటకృష్ణ ప్రసాద్, సింగిల్ విండో చైర్మన్ రఘు మా రెడ్డి, అంతటి నరసింహ, మారగొని ఆంజనేయులు , కంపెనీ బృందం తదితరులు పాల్గొన్నారు.
Read also : Paddy Procurement: ఓవైపు వానలు.. మరోవైపు మిల్లర్ల అలసత్వం.. అన్నదాతల అరిగోస!
Read also : ఇండియాకు మద్దతుగా ఎందరో.. మరి సౌతాఫ్రికాకు ఎక్కడ?.. నటి ఆవేదన





