తెలంగాణ

సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన… బాధిత కుటుంబానికి మైత్రీ మూవీ మేకర్స్ ఆర్ధిక సహాయం

క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో మృతి చెందిన రేవతి కుటుంబానికి “పుష్ప 2” చిత్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ ఆర్ధిక సహాయం అందించింది. మైత్రి మూవీస్ సంస్థ నిర్మాత నవీన్ సోమవారం నాడు 50 లక్షల రూపాయల చెక్కును మృతురాలి కుటుంబానికి అందించారు. తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాలుడు శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం రేవతి భర్త భాస్కర్ ను పరామర్శించి, చెక్కును అందించారు. తొక్కిసలాట ఘటనలో రేవతి మరణించడం చాలా బాధాకరం. వారి కుటుంబానికి తీరనిలోటు. ప్రస్తుతం బాబు శ్రితేజ్ కోలుకుంటున్నాడు. బాధిత కుటుంబానికి మావంతు సహాయం చేయడానికి వచ్చాం. వారి కుటుంబానికి ఎప్పటికి అండగా నిలబడతాము అని మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతలు తెలిపారు.

ఇవి కూడా చదవండి : 

  1. మోహన్‌బాబుకు చుక్కెదురు… బెయిల్ పిటిషన్‌ను కొట్టేసిన హైకోర్టు
  2. కొడంగల్‌లో తొడ గొట్టిన డీకే అరుణ.. రేవంత్ సంగతి తేలుస్తానని శపథం!
  3. సంధ్య థియేటర్ ఘటన, అల్లు అర్జున్ ఇష్యూ.. నేషనల్ మీడియాకు హైదరాబాద్ సీపీ క్షమాపణలు
  4. అల్లు అర్జున్ ఇంటిపై దాడి… నిందితులకు బెయిల్ మంజూరు
  5. అల్లు అర్జున్ నేషనల్ అవార్డ్ ను రద్దు చేయాలి : మల్లన్న

Back to top button