
క్రైమ్ మిర్రర్,ఆంధ్రప్రదేశ్:- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భూముల రి సర్వే పై రైతులు అభ్యంతరాలు తెలపడంతో తాజాగా డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం భూముల రీ సర్వేపై రైతుల అభ్యంతరాల పరిష్కారానికి ఎమ్మార్వో స్థాయిలో ప్రస్తుతం ఏడాది పొడవున గడువుండగా.. దీనిని రెండేళ్ల పాటు పెంచేలా ప్రభుత్వానికి సిఫారసు చేస్తాము అని డిప్యూటీ స్పీకర్ రఘు రామకృష్ణారాజు పేర్కొన్నారు. మొత్తం 16,000 గ్రామాలలో ఇప్పటివరకు 6688 గ్రామాలలో రీసర్వే పూర్తయిందని అధికారులు వెల్లడించారు. ఈ మొత్తం గ్రామాల నుంచి దాదాపు 7 లక్షల అభ్యంతరాలు రాగా అందులో రెండు లక్షల అభ్యంతరాలు పరిష్కారం అయ్యాయని డిప్యూటీ స్పీకర్ వెల్లడించారు. మిగతా అన్ని గ్రామాల్లో రీ సర్వే పూర్తి చేయాల్సిన సందర్భంలో ఎన్నో అభ్యంతరాలు వస్తాయి కాబట్టి వాటిని మొత్తాన్ని కూడా 2027 డిసెంబర్లో గా పారదర్శకంగా పూర్తి చేస్తామని డిప్యూటీ స్పీకర్ రఘురాం కృష్ణరాజు తెలిపారు.
Read also : WhatsApp: అందుబాటులోకి షెడ్యూల్ కాల్ ఫీచర్
Read also : Ilaiyaraaja: సోషల్ మీడియాలో ఇళయరాజా ఫొటో వాడొద్దు, హైకోర్టు తీర్పు!





