వైరల్సినిమా

Naga Chaitanya: సమంత రెండో పెళ్లి.. నాగ చైతన్య ఆసక్తికర పోస్టు!

సమంత, రాజ్ నిడిమోరు తాజాగా రెండో పెళ్లి చేసుకున్నారు. ఇద్దరికీ ఇప్పటికే పెళ్లి కాగా, వారిని వదులుకుని, తాజాగా వీరిద్దరు ఒక్కటయ్యారు.

Akkineni Naga Chaitanya: గత కొంత కాలంగా ప్రేమలో ఉన్న నటి సమంత, దర్శకుడు  రాజ్ నిడిమోరు తాజాగా పెళ్లి చసుకున్నారు. కొద్ది మంది బంధుమిత్రుల సమక్షంలో ఇద్దూ ఒక్కటయ్యారు. సమంత సోషల్ మీడియా వేదికగా తమ పెళ్లి ఫోటోలను షేర్ చేసింది. ఈ ఫోటోలు చూసి నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. కొంత మంది నెగెటివ్ గా కామెంట్స్ పెడితే, మరికొంత మంది శుభాకాంక్షలు చెప్తున్నారు.

సమంతపై నెటిజన్ల ట్రోలింగ్

సమంత పెళ్లి తర్వాత చాలా మంది నెటిజన్లు ఆమెను ట్రోల్ చేస్తున్నారు. నాగ చైతన్య మంచివాడంటున్నారు. ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’ నుంచే, సమంత రాజ్ తో ప్రేమాయణం కొనసాగిస్తుందంటున్నారు. అందుకే, చైతన్య విడాకులు ఇచ్చాడని చెప్పుకొస్తున్నారు. అదే సమయంలో, చైతన్య తమ విడాకుల గురించి మాట్లాడడం ఆపాలని, ఎవరి జీవితాలు వారు చూసుకున్నారని చేసిన వ్యాఖ్యలను కూడా వైరల్ అవుతున్నాయి.

https://www.instagram.com/p/DRtrePWET2L/

చైతన్య సోషల్ మీడియా పోస్టు వైరల్!

అటు సమంత పెళ్లి తర్వాత నాగ చైతన్య సోషల్ మీడియాలో పోస్టు పెట్టాడు. తాను నటించిన మొదటి వెబ్ సిరీస్ ‘దూత’ విడుదలై రెండేళ్లు అయిన సందర్భంగా ఈ పోస్టు చేశాడు. ఆ సిరీస్ ను హిట్ చేసిన ప్రేక్షకులకు ధన్యవాదాలు చెప్పుకొచ్చాడు.  నటుడిగా ఎంతో సృజనాత్మకంగా.. నిజాయితీగా కథను ఎంచుకొని, ఉత్తమమైన నటనను కనబరిచినప్పుడు.. ప్రజలు కనెక్ట్ అవుతారు అని చెప్పిన సిరీస్ ‘దూత’ అన్నారు. ‘దూత’ కోసం కష్టపడిన ప్రతి ఒక్కరికీ ఆయన ప్రత్యేక ధన్యవాదాలు చెప్పాడు.

https://www.instagram.com/p/DRuXs_rkwn9/

నాగ చైతన్య పోస్టుకు నెటిజన్ల రియాక్షన్ ఏంటంటే?

నాగ చైతన్య పెట్టిన పోస్టుకు నెటిజన్లు బాగా రియాక్ట్ అవుతున్నారు. సమంత పెళ్లి గురించి కీలక వ్యాఖ్యలు చేస్తున్నారు.  “సమంత పెళ్ళికి వెళ్లలేదా?.. వాళ్ళు పిలవలేదా?” అని కొందరు.. “ఈ రోజు చాలా బాగా గుర్తొచ్చావ్ బ్రో” అని ఇంకొందరు కామెంట్స్ చేస్తున్నారు. “సగం దరిద్రం వదిలింది అనుకో చై” మరికొందరు రియాక్ట్ అవుతున్నారు.

Back to top button