
క్రైమ్ మిర్రర్, ఆన్లైన్ డెస్క్ :-తాజాగా తమిళనాడు గవర్నర్ ఆర్‌ఎన్ రవి మరో వివాదానికి కారణమయ్యారు. ఒక కాలేజీ ఫంక్షన్‌లో పాల్గొన్న ఆయన ప్రసంగం మధ్యలో అకస్మాత్తుగా “జై శ్రీరామ్” నినాదాలు చేశారు. అంతటితో ఆగకుండా, అక్కడ ఉన్న విద్యార్థులను కూడా అదే నినాదాలు చేయమని ప్రోత్సహించారు.ఈ ఘటనపై తమిళనాడు లోని ద్రవిడ, రాజకీయ, సామాజిక సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి.
రాజ్యాధికార స్థాయిలో ఉన్న వ్యక్తి ఇలా మతపరమైన నినాదాలు చేయడాన్ని వారు తీవ్రంగా ఖండించాయి. గవర్నర్ ప్రవర్తన రాజ్యాంగ ఆత్మకు విరుద్ధమని విమర్శించాయి.ఈ నేపథ్యంలో గవర్నర్ ఆర్‌ఎన్ రవిని వెంటనే పదవి నుంచి తొలగించాలని విపక్షాలు, ద్రవిడ సంఘాలు కేంద్రాన్ని డిమాండ్ చేశాయి. ఇప్పటికే గవర్నర్ రాజకీయ వ్యాఖ్యలు, ప్రభుత్వం పై విమర్శలతో పలు మార్లు వార్తల్లో నిలిచిన నేపథ్యంలో, తాజా ఘటన మరింత వివాదాస్పదంగా మారింది.
ఇవి కూడా చదవండి ..
-
జేఈఈ విద్యార్థుల వివాదం – నిజం నిగ్గుతేలుస్తానన్న పవన్..!
-
పవన్ కల్యాణ్ చిన్న కుమారుడి హెల్త్ కండీషన్ సీరియస్
-
కూటమిలో కరివేపాకులా బీజేపీ – అరకొర పోస్టులపై అసంతృప్తి..!
-
టీడీపీ నెక్ట్స్ టార్గెట్ మాజీ మంత్రి రోజా – ఆడుదాం ఆంధ్రాలో అవినీతి పేరుతో కేసులు..?
-
ఏపీలో 2029లో ఆ పార్టీనే అధికారంలోకి వస్తుంది: ఉండవల్లి అరుణ్ కుమార్