తెలంగాణ
Trending

ఉద్యోగులకు ప్రత్యేక సెలవు ప్రకటించిన తెలంగాణ రాష్ట్రం!..

క్రైమ్ మిర్రర్, ఆన్లైన్ డెస్క్ :- తెలంగాణ రాష్ట్రం ఉద్యోగులకు ఫిబ్రవరి 27న ప్రత్యేక సెలవు ప్రకటించింది. తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికలను నేపథ్యంలో ఈ సెలవు ప్రకటించినట్లు తెలిపింది. కాగా ఆ రోజున వరంగల్- ఖమ్మం- నల్గొండ జిల్లాలో టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. ఇక మరోవైపు మెదక్- నిజామాబాద్- అదిలాబాద్- కరీంనగర్లో టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగునున్నాయి. అదే రోజున ఇదే స్థానానికి గ్రాడ్యుయేట్ ఎన్నిక జరుగునుంది.

దీంతో ఈ నియోజకవర్గాల పరిధిలోని టీచర్లకు ప్రభుత్వం ఫిబ్రవరి 27న ప్రత్యేక సెలవు ఇస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది. అటు ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే గ్రాడ్యుయేట్లు ఓటింగ్ లో పాల్గొనేలా రాష్ట్రంలోని కంపెనీలన్నీ కూడా సహకరించాలని ఎలక్షన్ కమిషన్ కోరింది. దీంతో ఉద్యోగులకు కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఎలక్షన్ లో పాల్గొని ఓట్లు వేసే అవకాశం ఉంది. కాబట్టి రాష్ట్రంలో ఈసారి ఎన్నికలు ఉత్కంఠంగా సాగే అవకాశం ఉంది.

ఇవి కూడా చదవండి

  1. రోడ్డు ప్రమాదంలో మహిళా దుర్మరణం..!
  2. రైతులకు యూరియా మరియు క్రాప్ లోన్స్ అందజేసిన సింగల్ విండో చైర్మన్ గట్టుపల్లి నర్సిరెడ్డి!..
  3. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం!… ఆ కారణంగా 24 గంటలు షాపులు తెరవచ్చు?
Back to top button