తెలంగాణ

తెలంగాణకు భారీ వర్ష సూచన, ఐదు జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌

ఉమ్మడి నిజామాబాద్‌, కరీంనగర్‌ అప్రమత్తం

Rains: తెలంగాణ వ్యాప్తంగా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. నిజామాబాద్‌, కామారెడ్డి, జగిత్యాల, నిర్మల్‌కు అధికారులు రెడ్‌ అలర్ట్‌ జారీ చేశారు. ఈ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వానలు కురిసే ఛాన్స్‌ ఉందని పేర్కొంది. వికారాబాద్‌, ఉమ్మడి మెదక్‌, ఆదిలాబాద్‌, వరంగల్‌, కరీంనగర్‌, పెద్దపల్లి జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని, హైదరాబాద్‌లో మోస్తరు వర్షం కురవొచ్చని వాతావరణ శాఖ తెలిపింది.

Read Also:

వరద ప్రాంతాల్లో సీఎం రేవంత్ ఏరియల్ సర్వే

Back to top button