తెలంగాణ

శ్రీశైలానికి పోటెత్తిన జనం, భారీగా ట్రాఫిక్‌ జాం

  • ఘాట్‌ రోడ్డులో ఎక్కడికక్కడ నిలిచిపోయిన వాహనాలు

  • పాతాళగంగ నుంచి దోమలపెంట వరకు జాం

  • వరుస సెలవులతో శ్రీశైలానికి భక్తుల క్యూ

శ్రీశైలం మహాక్షేత్రానికి జనం పోటెత్తారు. వరుస సెలవులు కావడం, శ్రీశైలం గేట్లు ఎత్తడంతో జనాలు తండోపతండాలు వస్తున్నారు. దీంతో అమ్రాబాద్‌ మండలం పాతాళగంగ నుంచి దోమలపెంట చెక్‌పోస్టు వరకు వాహనాలు నిలిచిపోయాయి. శ్రీశైలం రిజర్వాయర్‌ చూసేందుకు వెళ్తున్న వాహనాలు స్లోగా ముందుకు కదులుతున్నాయి.

వర్షాకాలంలో “వీకెండ్ టూర్”… మన తెలంగాణలో వాటర్ ఫాల్స్ ఎక్కడున్నాయో తెలుసా?

శ్రీశైలం క్షేత్రానికి వేలాదిమంది భక్తులు శనివారం ఉదయం నుంచే బస్సులు, కార్లు, ద్విచక్రవాహనాలతో రాకపోకలు సాగిస్తున్నారు. అలాగే జలాశయం గేట్లు ఎత్తడంతో దాని అందాలను చూసేందుకు పర్యాటకులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. దీంతో భక్తుల రద్దీ మరింత ఎక్కువైంది. పాతాళగంగ నుంచి దోమలపెంట వరకు దాదాపు 10 కిలోమీటర్ల వరకు వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. ట్రాఫిక్‌ను సరిచేసేందుకు పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు. రోడ్లపై ఇష్టారీతిన పార్క్‌ చేసిన వాహనాలను పక్కకు తొలగిస్తున్నారు. పలు చోట్ల వాహనదారుల కోసం జాగ్రత్తలు సూచిస్తున్నారు. భక్తులు, పర్యాటకులు సహనంతో ఉండాలని, ట్రాఫిక్ నియమాలు పాటిస్తూ శ్రీశైలానికి వెళ్లాలని సూచిస్తున్నారు. అత్యవసర పరిస్థితుల్లో పోలీసులను సంప్రదించాలని, వారికి సహకరించాలని కోరుతున్నారు.

Back to top button