
గండిపేట్, క్రైమ్ మిర్రర్:- ప్రజల సమస్యల పరిష్కారానికి దశలవారి పరిష్కారం చూపడం జరుగుతుందని రాజేంద్రనగర్ నియోజకవర్గం ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ అన్నారు. నియోజకవర్గంలో అన్ని సమస్యలపై దృష్టి పెట్టానని సాధ్యమైనంత త్వరగా పరిష్కరిస్తానన్నారు. శనివారం అండర్ డ్రైనేజీ పైప్ లైన్ పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పైప్ లైన్ నిర్మాణంతో బుద్వేల్ రైల్వే స్టేషన్ తో పాటు పలు కాలనీల ప్రజల ఇబ్బందులు తొలగిపోతాయని అన్నారు. నిర్మాణ పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ త్వరగా పూర్తి చేయాలని సూచించారు. ప్రభుత్వ అండతో నియోజకవర్గంలో మౌలిక సదుపాయాల ఏర్పాటుకు కోసం తన వంతుగా కృషి చేస్తున్నానని అన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ తోకల శ్రీనివాస్ రెడ్డి, డివిజన్ అధ్యక్షులు ధనంజయ్, ప్రేమ్ గౌడ్, జీవన్ గౌడ్, సరికొండ వెంకటేష్, కళ్లెం లక్ష్మారెడ్డి, సోమ శ్రీనివాస్ గుప్తా, పలువురు నాయకులు, అధికారులు పాల్గొన్నారు.
Read also : తిరుమలలో భక్త “జనసంద్రం”
Read also : తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ హెచ్చరికలు?