
మన భారతదేశంలోని ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఈ సంవత్సరం జనవరి నెలలో అయోధ్య రామ మందిరం కట్టించిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే తాజాగా ఉత్తరప్రదేశ్‌లో ని అయోధ్య నగరంలోనె కొత్తగా అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం ను ఏర్పాటు చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్య మరియు సుల్తాన్పూర్ రహదారిపై ఈ స్టేడియం నిర్మితం అయింది.
కేసీఆర్, హరీష్‌రావులకు హైకోర్టులో ఊరట.. ఫిర్యాదుదారుడికి నోటీసులు జారీ
ఇక ఈ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం అనేది డాక్టర్ భీమ్రావు అంబేద్కర్ ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ ప్రాజెక్టులో భాగమని క్రికెట్ వర్గాలు తెలిపాయి. ఈ స్టేడియం లో దాదాపుగా 40 వేల మంది దాకా ప్రేక్షకులు కూర్చొని మ్యాచ్ ను వీక్షించేలా అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది కూడా మన భారతదేశంలో ఒక పెద్ద అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ఒకటిగా నిలిచింది.
అల్లు అర్జున్ మళ్లీ అరెస్ట్.. తగ్గేదే లే అంటున్న సీఎం రేవంత్!
ఇక ఇప్పటికే ఉత్తరప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా గ్రీన్ పార్క్ క్రికెట్ స్టేడియం ఉంది. మరోవైపు లక్నోలో ఎకాన స్టేడియం కూడా ఉన్న విషయం మనందరికీ తెలిసిందే. కాగా ఇప్పటికే మన భారతదేశం వ్యాప్తంగా చాలా రాష్ట్రాల్లో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియాలు ఉన్న విషయం మనందరికీ తెలిసిందే. ఇప్పుడు ఉత్తర ప్రదేశ్ లో కూడా అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం ను ఏర్పాటు చేశారు.