తెలంగాణరాజకీయం

నష్ట పోయిన రైతులకు ఎకరాకు 40 వేలు ఇవ్వాలి

వేములపల్లి మండల బిజెపి అధ్యక్షులు పెదమాం భరత్

రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకం అమలు చేయాలి

క్రైమ్ మిర్రర్ ప్రతినిధి, వేములపల్లి: తాజాగా వచ్చిన తుపాను ‘మోంథా’ మరియు అకాల వర్షాల కారణంగా పంట నష్టపోయిన రైతుల పొలాలను బీజేపీ వేములపల్లి మండల శాఖ ఆధ్వర్యంలో నల్గొండ జిల్లా, వేములపల్లి మండలం పరిదిలోని శెట్టిపాలెం గ్రామంలో రైతులపంటపొలాలను బుధవారం పరిశీలించారు.

ఈ సందర్బంగా బీజేపీ మండల పార్టీ అధ్యక్షులు పెదమాం భరత్ మాట్లాడుతూ… తుపాను ‘మోంథా’ కారణంగా మండలంలోనీ అనేక గ్రామాలలో చేతికొచ్చిన పంట అధిక వర్షానికి,గాలి దుమారాలకు వరి పైరు నేలకొరిగి పూర్తిగా నీట మునిగా అన్నారు.

Also Read:జీహెచ్‌ఎంసీ(GHMC) వాహనంపై విరిగిపడ్డ కొండచరియలు

దీంతో రైతులు కన్నీటి పర్యంతమవుతున్నారని కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే యుద్ధ ప్రాతిపదికన వ్యవసాయ అధికారులు, రెవిన్యూ సిబ్బంది నష్టపోయిన పంట పొలాలను పరిశీలించి ప్రతి ఎకరాకు 40 వేల రూపాయల పంట నష్టం కింద అందించాలని డిమాండ్ చేశారు.

కేంద్ర ప్రభుత్వం రైతుల కోసం ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకంలో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసి ఉంటే రైతుకు న్యాయం చేకూరి ఉండేదన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం పసల్ బీమాను అమలు చేయాలని డిమాండ్ చేశారు.

Also Read:తగ్గిన తుఫాన్ ప్రభావం.. మరి రేపు స్కూళ్లకు సెలవులు ప్రకటిస్తారా?

ఈ కార్యక్రమంలో బిజెపి కిసాన్ మోర్చా రాష్ట్ర నాయకులు జవ్వాజీ సత్యనారాయణ, చల్లమల్ల సీతారాం రెడ్డి, పెదమాం వెంకన్న, మండల బిజెపి నాయకులు పెదమాం ప్రసాద్,చక్కని ఉపేందర్, మజ్జిగపు రాంరెడ్డి మాతంగి ప్రభాకర్, సోమయ్య, అనిల్, మహేష్, సతీష్, రైతులు పండుగ అంజయ్య, పండుగ లింగయ్య, మహబూబ్, మల్లయ్య, తదితరులు పాల్గొన్నారు…

Also Read:జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం

Back to top button