జాతీయం

బాంబే స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌కి బాంబు బెదిరింపు… 4 ఆర్డీఎక్స్‌ బాంబులు పెట్టినట్లు మెయిల్‌

  • మ.3గంటలకు పేల్చుతామని హెచ్చరిక

  • కామ్రేడ్‌ పినరయి విజయన్‌ పేరుతో మెయిల్‌

  • భవనంలో బాంబు స్క్వాడ్‌ బృందాల తనిఖీలు

  • ఢిల్లీలోని సెయింట్‌ స్టీఫెన్స్‌ కాలేజీ, సెయింట్‌ థామస్‌ స్కూల్‌కు బెదిరింపు

  • ముందు జాగ్రత్తగా విద్యార్థులను బయటకు పంపిన యాజమాన్యం

క్రైమ్‌ మిర్రర్‌, నిఘా: బాంబేలోని స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ భవనానికి బాంబు బెదిరింపు మెయిల్‌తో కలకలం రేగింది. భవనంలో నాలుగు ఆర్డీఎక్స్‌ బాంబులు అమర్చినట్లు దుండగులు మెయిల్‌ చేశారు. మధ్యాహ్నం 3గంటలకు బాంబులు పేల్చుతామని హెచ్చరికలు జారీ చేశారు. అయితే ఈ మెయిల్‌ కామ్రేడ్‌ పినరయి విజయన్‌ పేరుతో ఉన్న మెయిల్ నుంచి వచ్చినట్లు అధికారులు గుర్తించారు. బాంబే స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ భవనంలో బాంబు స్క్వాడ్‌ బృందాలు, భద్రతా బలగాలు తనిఖీలు నిర్వహించారు. అయితే ఎలాంటి అనుమానాస్పద వస్తువులు దొరక్కపోవడంతో ఫేక్‌ మెయిల్‌గా భావిస్తున్నారు. మెయిల్‌ పంపిన దుండగులపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.

ఢిల్లీలోని కాలేజీలకు బాంబు బెదిరింపు

ఢిల్లీ యూనివర్సిటీకి చెందిన సెయింట్ స్టీఫెన్స్‌ కాలేజీకి, సెయింట్‌ థామస్‌ స్కూల్‌కి దుండుగులు బాంబు బెదిరింపు మెయిల్స్‌ పంపినట్లు స్థానిక అధికారులు వెల్లడించారు. దీంతో బాంబుస్క్వాడ్‌ బృందాలు హుటాహుటిన తనిఖీలు మొదలుపెట్టాయి. ముందు జాగ్రత్త చర్యగా విద్యార్థులను బయటకు పంపారు.

Back to top button