తెలంగాణ
Trending

ఎన్నికల పై సంచలన వ్యాఖ్యలు చేసిన కవిత..

క్రైమ్ మిర్రర్, ఆన్లైన్ డెస్క్ :-
తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికలపై సంచలన ప్రకటన చేశారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. ఈనెల 27న జరగనున్న టీచర్స్, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇండిపెండెంట్లుగా బరిలో ఉన్న బీసీలను గెలిపించుకోవాలని పిలుపిచ్చారు. కొంత కాలంగా బీసీల కోసం బలంగా పోరాడుతున్నారు కవిత. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. కాంగ్రెస్ సర్కార్ పై ఒత్తిడి తెచ్చేలా పలు కార్యక్రమాలు నిర్వహించారు. తాజాగా బీసీలను ఎమ్మెల్సీలుగా గెలిపించాలని పిలుపిచ్చారు కవిత.

చందిప్ప మరాటిగూడలో చత్రపతి శివాజీ విగ్రహ నిర్మాణానికి భూమి పూజ

తెలంగాణలో జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీకి బీఆర్ఎస్ దూరంగా ఉంది. దీంతో గులాబీ పార్టీ సానుభూతి పరులు ఎవరికి వేటు వేస్తారన్నది ఆసక్తిగా మారింది. బీసీలను గెలిపించుకోవాలని కవిత పిలుపు ఇవ్వడంతో బీఆర్ఎస్ కేడర్ మొత్తం బీసీ అభ్యర్థులను మద్దతు ఇవ్వబోతున్నారు. కవిత ప్రకటనతో ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీసీ అభ్యర్థులకు బూస్ట్ ఇచ్చినట్లే. బీసీలను గెలిపించుకోవాలని పిలుపిచ్చిన కవితకు బీసీ సంఘాలు కృతజ్ఞతలు చెప్పాయి. కొద్ది రోజులుగా కవిత బీసీల కోసం పోరాడుతున్నారని.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీసీలను గెలిపించుకోవాలని పిలుపు ఇచ్చి.. బీసీల పట్ల ఆమె తన చిత్తశుద్ది చాటుకున్నారనే చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతోంది.

వైసీపీ పాలనలో రాష్ట్రం నష్టపోయింది .. స్వర్ణాంధ్ర దిశగా అడుగులు వేస్తున్నాం.. గవర్నర్‌ ప్రసంగంలో కీలక అంశాలు ఇవే.

ఎన్నికల ఎఫెక్ట్… పలు జిల్లాలలో వైన్ షాపులు బంద్!.

Back to top button