క్రైమ్తెలంగాణ

తీన్మార్ మల్లన్న ఆఫీసుపై దాడి.. గాల్లోకి 5 రౌండ్లు గన్‌ఫైర్

క్రైమ్ మిర్రర్, హైదరాబాద్‌ : మేడ్చల్ మల్కాజ్గిరి మేడిపల్లిలోని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న కార్యాలయం వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఆదివారం ఉదయం తెలంగాణ జాగృతి కార్యకర్తలు మల్లన్న ఆఫీస్ పై దాడి చేశారు. దాడి సమయంలో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఆఫీసులోనే ఉన్నారు.

జాగృతి కార్యకర్తలు మల్లన్నపై నేరుగా దాడి చేయడానికి యత్నించారని సమాచారం. ఈ సందర్భంగా పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న గన్ మెన్ గాల్లోకి 5 రౌండ్లు గన్‌ఫైర్ చేశారు. దీంతో జాగృతి కార్యకర్తలు అక్కడి నుంచి చెదరీ నట్లు తెలుస్తోంది. కాగా ఈ దాడిలో ఆఫీసులోని ఫర్నిచర్ ధ్వంసం అయ్యింది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పరిస్థితి అదుపులోకి వచ్చినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Back to top button